చీప్ లిక్కర్ కావాలా.. మీడియం, ప్రీమియం బ్రాండ్లు కొనాల్సిందే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

If you want cheap liquor : అమరావతిలోని బార్‌ అండ్ రెస్టారెంట్లకు.. ఎక్సైజ్ అధికారులు షాకిచ్చారు. చీప్ లిక్కర్ అమ్మకాలపై ఆంక్షలు విధించారు. అనధికార షరతులు పెడుతూ.. బార్ అండ్ రెస్టారెంట్లపై ఒత్తిడి పెడుతున్నారు. మీడియం, ప్రీమియం బ్రాండ్ల లిక్కర్ కొంటేనే.. చీప్ లిక్కర్ కొనుగోలుకు అనుమతిస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లు 50 కేసులు కొంటేనే .. పది కేసుల చీప్ లిక్కర్ కొనేందుకు అనుమతిస్తున్నారు.బార్ అండ్ రెస్టారెంట్లు.. చీప్ లిక్కర్‌ను ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో.. అధికారులు ఈ ఆంక్షలు పెట్టారు. మీడియం, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు తగ్గాయని వాటి కంపెనీలు గగ్గోలు పెట్టడంతో.. చీప్ లిక్కర్ కావాలంటే.. మీడియం, ప్రీమియం బ్రాండ్లు కొనాల్సిందేనని అధికారులు షరతులు పెడుతున్నారు.కొన్ని రోజుల క్రితం లిక్కర్ ధరలను తగ్గించిన ప్రభుత్వం మరోసారి లిక్కర్ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయనే వాదన ఉంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగింది. దీంతో మద్యం ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు 25శాతం తగ్గించింది. తగ్గించిన ధరలు అక్టోబర్ 30వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. రూ. 250-300 వరకు ఉన్న మద్యం బాటిల్ పై ధరను రూ. 50 తగ్గించింది. భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యంతో పాటు, విదేశీ లిక్కర్ ధరలను కూడా ప్రభుత్వం తగ్గించింది.

Related Tags :

Related Posts :