మీరు బయటి ఫుడ్ తినేందుకు ప్లాన్ చేస్తున్నారా…? ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశవ్యాప్తంగా స్టే-ఎట్-హోమ్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్న తరుణంలో చాలా మంది భారతీయులు రెస్టారెంట్ భోజనానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు? అక్కడే ఆగండి.. దేశంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు రోజురోజుకీ అంతకంతకూ పెరిగిపోతాయి. ప్రతిరోజు వందలు వేలల్లో కేసులు నమోదువుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బయట ఫుడ్ కోసం ప్లాన్ చేయడం మానుకోవడమే ఉత్తమమని అంటున్నారు నిపుణులు.

సాధారణంగా రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ చేసినప్పటికీ అక్కడ తినకుండా ఇంటికి తెచ్చుకుని తింటున్నారు. మరికొందరు నెలల తరబడి ఇంట్లో ఫుడ్ తినడం బోర్ గా అనిపించి బయటి ఫుడ్‌పై ఇష్టం పెంచుకుంటున్నారు. కరోనా కాలంలో వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతోంది. చాలామంది తినడం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. గుడ్ న్యూస్ ఏమిటంటే.. రెస్టారెంట్‌లో భోజనాన్ని తినేటప్పుడు మిమ్మల్ని మీరు సాధ్యమైనంత సురక్షితంగా ఉంచడానికి కొన్ని మార్గాలను అనుసరించవచ్చు.

ఇవిగో.. సులభమైన చిట్కాలు:
ముందుగా… మీరు ప్రస్తుతం అంటువ్యాధులు పెరుగుతున్న ప్రదేశంలో నివసిస్తున్నారా లేదా సాపేక్షంగా స్థిరంగా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. తినడం సురక్షితం అని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీరు ఎంచుకున్న రెస్టారెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో ప్రయత్నించండి. అక్కడి సిబ్బంది మాస్క్ ధరించడం, సిబ్బందికి, అతిథులకు రెస్టారెంట్ అంతటా పారిశుధ్యమైన వాతావరణం ఉందో లేదో ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి.

మీ సొంత ఫేస్ షీల్డ్ ధరించి తప్పదు అనుకున్నప్పుడే ఆరుబయట తినడానికి ఎంచుకోండి. ఇండోర్ ఎయిర్ హ్యాండ్లింగ్ కంటే ప్రకృతి గాలి ఎంతో మంచిది. ప్రెష్ ఎయిర్ లో ఉన్నప్పుడు కరోనా వ్యాప్తి ప్రసారం తక్కువగా అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చునని అంటున్నారు. మీకు, ఇతర రెస్టారెంట్ అతిథుల మధ్య దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. అరవడం, కౌగిలించుకోవడం లేదా మరెవరినైనా తాకడం మానుకోండి. తినేటప్పుడు మీరు మాస్క్ ధరించలేరు. కానీ టేబుల్‌పై రెస్టారెంట్‌లో తాకిన అన్ని వస్తువులు తరచుగా శుభ్రం చేస్తున్నారో లేదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

మరో విషయం గుర్తుంచుకోండి.. మీరు తినడానికి ముందు.. బాత్రూమ్ తర్వాత చేతి పరిశుభ్రత పాటించడం వైరస్ నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచడానికి ముఖ్యమైన విషయాలని మరవద్దు. ఉపరితల కాలుష్యం సామర్థ్యాన్ని తగ్గించడంతో పాటు, భోజనం చేసేటప్పుడు దూరం నిర్వహించడం కూడా ఎంతో ఉత్తమం. ముఖ్యంగా మీ మాస్క్ లేని సమయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఆహారం నుంచి వైరస్ సంక్రమించే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ వైరస్.. ఆహార ద్వారా వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు.