లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

అక్రమ సంబంధం…ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ..విషయం తెలుస్తుందని ఆత్మహత్య

Published

on

illegal-affiar-wife-killed-by-husband1

ప్రియుడితో కలసి భార్య, భర్తను హత్య చేసిన ఘటన వికారాబాద్ లోని అనంతగిరి అడవుల్లో జరిగింది. అత్తగారు మరణించే సరికి అసలు విషయం బయటపడటంతో ..దొరికి పోతామనే భయంతో ఆత్మహత్యా యత్నం చేసిందా ఇల్లాలు.

రంగా రెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బెండ్ల చెన్నయ్య(38) శశికళ దంపతులు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఇద్దరు పిల్లలు. చెన్నయ్య మద్యానికి బానిసయ్యాడు. శశికళ వరుసకు మరిది అయ్యే రమేష్ అనే వ్యక్తితో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కొ్న్నాళ్లకు ఈ విషయం చెన్నయ్యకు తెలిసిపోయింది.

ఈ విషయమై భార్యా భర్తలు తరచూ గొడవపడే వారు. భర్తకు తన అక్రమ సంబంధం విషయం తెలిసి పోవటంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ఎదురు చూస్తోంది శశికళ.  జులై 6వ తేదీ భర్త, ప్రియుడు, శశికళ ముగ్గురు పరిగి వచ్చారు. అక్కడ మద్యం కొనుగోలు చేశారు.

అక్కడి నుంచి ముగ్గురు కలిసి అనంతగిరి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ ఫుల్లుగా మద్యం తాగారు. ముందే ప్లాన్ వేసుకున్న శశికళ, రమేష్ లు చెన్నయ్య చేత ఎక్కువ తాగించారు. మద్యం మత్తులో ఉన్న చెన్నయ్యపై బండ రాళ్లతో దాడి చేసి చంపేశారు. మృతదేహాం కనపడకుండా ఆకులు. చెట్ల కొ్మ్మలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

5 రోజులు ఎవరికీ ఏమీ అనుమానంరాలేదు. రొటీన్ గా ఏమీ తెలియనట్లే శశికళ నడుచుకుంటోంది. ఈలోగా 11 వ తేదీ చెన్నయ్య తల్లి బాలమ్మ అనారోగ్యంతో మరణించింది. ఆమె అంత్యక్రియలకు కుమారుడు చెన్నయ్య హాజరు కాకపోవటం, భార్య ఏమీ తెలియనట్లుండటం పలువురికి అనుమానం వచ్చి ఆమెను నిలదీశారు.

శశికళ చెప్పిన పొంతన లేని సమాధానాలతో 14వ తేదీ పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. 14వ తేదీ పంచాయతీలో చెన్నయ్యను హత్య చేసిన విషయం తెలిసిపోతుందని భయపడిన శశికళ 13వ తేదీ రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బంధువులు ఆమెను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ క్రమంలో శశికళతో సన్నిహితంగా ఉంటున్న రమేష్ ను బంధువులు నిలదీయటంతో హత్య ఉదంతం మొత్తం చెప్పాడు. దీంతో బంధువులు గ్రామస్తులు అతడ్ని తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లి శవాన్ని గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు కేసును నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *