బాబాయ్ ని ప్రేమించిన కూతురు…..పెళ్లి చేసుకునే ధైర్యంలేక ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రేమకు ఆస్తులు, అంతస్తులు, కులాలు మతాలు ఏవీ అడ్డురావనేది అందరకీ తెలిసిన విషయమే…. కానీ ఇటీవల కొన్ని ఘటనలు చూస్తుంటే వయస్సు, వావి వరసలు కూడా ఉండవని రుజువవుతోంది.రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సారాపూర్ తండాలో ఇదే జరిగింది. తండాకు చెందిన సేనావత్ రమేష్ (24) హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అదే తండాకు చెందిన యువతితో రమేష్ ప్రేమలో పడ్డాడు. వాస్తవానికి ఆమె అతనికి కూతురు వరస అవుతుంది. ఈ  వావి, వరసలను పక్కన పెట్టి వాళ్లిద్దరూ 3 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలిసి ఇటీవల వేరే వ్యక్తితో ఆమె పెళ్లి నిశ్చయించారు.

ఇక తామిద్దరం విడిపోక తప్పదని ప్రేమికులకు తెలిసి పోయింది. తమ ప్రేమను పెద్దలు, సమాజం హర్షించదని భావించిన ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి ఒడి గట్టారు. జులై 28 మంగళవారం రాత్రి ఇద్దరూ కల్సి గ్రామ సమీపంలోని వ్యవసాయ భూమిలోకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ కల్సి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.బుధవారం ఉదయం రమేష్ కు స్పృహ వచ్చింది. పక్కనే ప్రియురాలు అచేతనంగా పడి ఉంది. ఆమె మరణించిందని భావించిన రమేష్ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిని చూసిన కొందరు గ్రామస్తులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

కాగా రమేష్ అప్పటికే ప్రాణాలు విడవగా…. యువతి కొన ఊపిరితో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్ధితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆత్మహత్యలపై సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్యా , లేక పరువు హత్య ఏమైనా జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.


Related Posts