కోడలితో లేచిపోయిన మామ….కుటుంబ సభ్యులకు మత్తు మందిచ్చి పరార్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా భర్త కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నారు కొందరు మహిళలు. పడక సుఖం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. వావి వరసలు మర్చిపోతున్నారు. వయస్సు బేధం మర్చిపోతున్నారు.

కేవలం పడక సుఖం కోసం వావీవరసలు మరిచి బరితెగిస్తున్నారు. కన్నకూతురులా చూసుకోవాల్సిన ఇంటికి వచ్చిన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ మనవడ్ని తీసుకుని కోడలితో సహా పరారయ్యాడు.హర్యానాలోని పానిపట్ లోని సోనీకాలనీలో సలీం అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. సలీం తన కొడుకు అబ్దుల్ కు నాలుగేళ్ళ క్రితం అసామా అనే యువతితో వివాహం జరిపించాడు. వారికి మూడేళ్ల కుమార్తె, 10 నెలల బాలుడు ఉన్నారు.

కోడలు కాపురానికి వచ్చిన కొన్నాళ్లకు మామ సలీం, తన  కోడలు అసామాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కూతురిలాంటి కోడలితో తన కామ కోరికలు తీర్చుకునేవాడు. అసామా కూడా మామ సలీంకు సహకరించేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ లైంగికంగా కలిసే వారు.కుటుంబ సభ్యులకు తెలియకుండా అవకాశం చిక్కినప్పుడల్లా మామ కోడలు రహస్యంగా రాసలీలలు సాగించేవారు. మిగతా సమయాల్లో మామా కోడలు ప్రతి చిన్న విషయానికి గొడవపడే వాళ్లు. దాంతో మామకోడలు మధ్య ఎఫైర్ ఉందని ఎవరూ అనుమానించలేకపోయారు. ఎన్నాళ్ళిలా దొంగతనంగా కుటుంబానికి భయపడుతూ సుఖాన్ని అనుభవించాలి ? అనుకున్నారు. ఇంట్లోనుంచి పారిపోవాలని మామ కోడలు నిశ్చయించుకున్నారు.
కోడలు అసామా తన 10నెలల బిడ్డతో సహా మామతో లేచిపోయింది.

ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్న రోజు రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి అందరికీ వడ్డించింది అసామా. ఆ ఆహారాన్ని మామ కోడలు మాత్రం తినలేదు, అందరూ ఘాడ నిద్రలో ఉండగా మామ కోడలు 10 నెలల చిన్నారితో సహా లేచిపోయారు. తెల్లవారి నిద్రలేచాక ఇంట్లో మామ,కోడలు కనపడకపోయే సరికి కుటుంబ సభ్యులు గ్రామంలో గాలించారు.ఎక్కడా కనపడకపోయే సరికి పానిపట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమీపంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా మామ కోడలు పరారవుతున్న దృశ్యాలను గుర్తించారు. వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

Related Posts