ఈ పోలీస్ ఎలా తన్నాడో చూడండి..వీడియో వైరల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొంతమంది పోలీసులు చేస్తున్న పనులు అందరూ తలదించుకొనేలా చేస్తున్నారు. ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. తమ ఆగ్రహాన్ని వేరే వ్యక్తులపై చూపెడుతున్నారు. నిలబడిన ఓ వ్యక్తిపై నిర్లక్ష్యంగా కాలితో తన్నడంతో అతను కిందపడిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఆ పోలీసుపై విమర్శలు చేస్తున్నారు.

అసలేం జరిగింది : –
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి వచ్చారు. గజ ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు పోలీసు అధికారులు చేపట్టారు. దీనిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ గుమికూడారు.

అక్కడనే ఉన్న ఓ పోలీసు…ఫోన్ లో మాట్లాడుకుంటూ…ఓ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అమాంతం..మోకాళ్లపై తన్నాడు. అతను కిందపడిపోయాడు. మరలా..తన్నడంతో..పట్టు కోల్పోయి..నదిలో పడిపోయాడు. అసలు ఎందుకు తన్నాడో ఎవరికీ అర్థం కాలేదు.

కానీ..కోవిడ్ నిబంధనలు పాటించలేదని, భౌతిక దూరం పాటించలేదన్న కారణంతో ఆ పోలీస్ ఈ విధంగా చేశాడని అంటున్నారు. ఇలా చేయాల్సింది కాదని…కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts