Home » ఇదేం ఆనందం : కుక్కను నదిలో విసిరేసిన యువకుడు
Published
4 months agoon
By
madhuIndian city of Bhopal : జంతువుల పట్ల కొంతమంది హీనంగా ప్రవర్తిస్తున్నారు. జాలి, దయ లేకుండా వాటితో ఆడుకుంటున్నారు. ఒకడు..ఉరి వేసి, నోట్లో బాంబులు పెట్టి..ఇలా..ఏదో ఒకటి చేసి వికృత ఆనందం పొందుతున్నారు. ఇటీవలే ఈ ఘటనలు భారతదేశంలో ఎక్కువవుతున్నాయి.
ఆవు నోటిలో బాంబులు పెట్టి పేల్చిన ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతుంటే..మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు కుక్కను నదిలోకి విసిరేసి..ఆనందం పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఆ యువకుడిపై తిట్ల దండం చదువుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన యువకుడు శునకాన్ని నదిలో విసిరేసి క్షణికానందం పొందాడు. నదిలో పడేసిన తర్వాత ఆ కుక్కను చూస్తు వికృతానందం పొందాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. వీడియోలో బ్యాక్ గ్రౌండ్ ప్లేగా కమాండ్ 3 పాట కూడా వినిపిస్తోంది. దీనిపై నెటిజన్లు ఘాటుగా రియాక్టవుతున్నారు. జంతు హక్కుల సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో వీడియో ఆధారంగా అతడిని గుర్తించే పనిలో పడ్డారు.
In Bhopal, man named Salman Khan threw a street dog into a pond & started laughing sadistically
Now he has been arrested by the cops@PetaIndia dare to condemn this? pic.twitter.com/pVqQ8sC1Id
— Mahesh Vikram Hegde (@mvmeet) September 14, 2020