in-telangana-2-days-raining

తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది.

శుక్రవారం హైదరాబాద్‌ సహా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబాబాద్‌, ములుగు, ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.

ఆంధ్రప్రదేశ్ లోనూ కొద్దిప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

Related Tags :

Related Posts :