epf interest rates hike

పెరగనున్న ఈపీఎఫ్ వడ్డీరేట్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉద్యోగులకు శుభవార్త. ఈపీఎఫ్ అకౌంట్ వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదేగాని జరిగితే దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది.

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్రం ఉద్యోగులకు తాయిలాలు ప్రకటిస్తోంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్  ఖాతాల వడ్డీరేట్లు పెంచేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2018-19  సంవత్సరానికి గానూ వడ్డీరేటును 8.55 నుంచి పెంచే ఆలోచనలో కేంద్రప్రభుత్వం ఉందని సమాచారం.

ఇదే జరిగితే దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులకు లబ్ధి  చేకూరుతుంది. ఈనెలలో జరిగే బోర్డు మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈపీఎఫ్ వడ్డి రేటు పెంపుదల అంశాన్ని బోర్డు సభ్యులు ధృవీకరించారు.
 

Related Posts