రికార్డ్ స్థాయిలో పెరిగిన బంగారం ధర…వెండి పరుగు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గోల్డ్ ప్రైస్ ఆల్ టైమ్ హై రికార్డు క్రియేట్ చేసింది. బంగారం ధర బాటలోనే మరో మెటల్ కేజీ సిల్వర్ రేటు కూడా పరుగులు పెడుతుంది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం, వెండి రేటు కూడా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధర పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్ లో కూడా బంగారం ధర ర్యాలీ చేసిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్ సంగతి చూస్తే శుక్రవారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 మేర జంప్ చేసింది. దీంతో తులం బంగారం ధర రూ.51,460 చేరింది. ఇదే ఆల్ టైమ్ హైఎస్ట్ రేటు.

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర 400 రూపాయల పెరుగుదలతో రూ.47,180 కు చేరింది. కేజీ వెండి రేటు ఏకంగా రూ.1,880 పెరుగటంతో కిలో గ్రామ్ సిల్వర్ రూ. 51,900 చేరింది. వెండి తయారీ యూనిట్ల నుంచి డిమాండ్ పెరగటం సిల్వర్ కాయిన్స్ కు డిమాండ్ పెరగడమే వెండి ధర పెరగడానికి కారణంగా తెలుస్తుంది. గోల్డ్ రష్ ఇంటర్నేషనల్ గానూ కంటిన్యూ అయింది.

ఔన్స్ గోల్డ్ రేట్ 0.13 శాతం పెరగడంతో 1806 డాలర్ల స్థాయికి చేరింది. ఇన్ ప్లెషన్ పెరగడం చైనా, అమెరికా మధ్య పెరిగిపోయిన అగాధం వంటి గ్లోబల్ రీజన్స్ బంగారం ధరలో పెరుగుదలకు ప్రాథమిక కారణాలుగా తెలుస్తోంది. ఈ పరుగు ఇక్కడితో ఆగదని ముందే అంచనాలు ఉన్నా.. ఒక్క నెలలోనే బంగారం పాత రికార్డు బద్దలు కొట్టి తులం రేట్ దాదాపు 52 వేలకు చేరటం విశేషం.

Related Posts