లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్..

Published

on

limb-lengthening surgery : అందరిలాగా తాము అంత ఎత్తుగా లేమని కొంతమంది బాధ పడుతుంటారు. కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని అనుకుంటారు. ఇందుకు ప్రయోగాలు కూడా చేస్తారు. ఇందుకు కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరికీ సాధ్యమౌతుంది..మరికొంతమందికి సాధ్యం కాకపోవచ్చు. కానీ..అమెరికాకు చెందిన ఓ యువకుడు మాత్రం సక్సెస్ అయ్యాడు. ఏకంగా ఆపరేషన్ చేయించుకుని అనుకున్న ఎత్తు పెరిగాడు.

అమెరికాకు చెందిన అల్ఫోన్సో ఫ్లోరెస్ కు 28 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఇతని వయస్సు 5 ఫీట్ల 11 ఇంచుల ఎత్తు ఉన్నాడు. కానీ.. ఆరు ఫీట్లు ఉండాలని కోరిక. చిన్నప్పటి నుంచే కలలు కనేవాడు. ఈ క్రమంలో..ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దేబీ పర్షద్ ను సంప్రదించాడు. ఇతను LimbplastX Institute లో డాక్టర్. ఆపరేషన్ అవసరం అవుతుందని తెలిపారు. లింగ్ – లెంథనింగ్ సర్జరీ ద్వారా ఎత్తు పెంచారు. ఇప్పుడతను 6 ఫీట్ల ఒక ఇంచు ఉన్నాడు. దీంతో అతని సంతోషానికి అవధులు లేవు. ఈ ఎత్తు రావడానికి ఏడు నెలల సమయం పట్టింది.

అసలు ఏం చేశారు.

కాళ్లలోని ఎముకలకు రంధ్రం చేసి వాటిని రెండుగా విడదీశారు. తర్వాత..వాటి మధ్య లోహంతో చేసిన ఓ రాడ్ ను అమర్చారు. కావాల్సిన పరిణామానికి చేరుకొనే వరకు ప్రతి రోజు దానిని ఒక్కో మిల్లిమీటర్ వరకు పెంచుతూ వచ్చారు. కాలి ఎముకలను కట్ చేసి ఓ డివైజన్ ను ఇన్ సర్ట్ చేయడమే కాస్మోటిక్ లింబ్ – లెంథినింగ్ సర్జరీ విధానమంటారని దేబీ పర్షద్ తెలిపారు.