డెలివరీకోసం హాస్పటల్ కెళ్లింది… పక్కబెడ్ మీద ప్రియురాలి డెలివరీ కోసం వచ్చిన భర్తను చూసి… భార్య షాక్..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆమె ఒక హెల్త్ వర్కర్.. డెలివరీ సమయమైంది.. ఆస్పత్రికి వెళ్లింది.. తనతో పాటు భర్త లేడు. ఆమె ఒక్కదే వెళ్లింది.. డెలివరీ చేసేందుకు లేబర్ రూంకు తీసుకెళ్లారు. అదే సమయంలో ఊహించని అనుభవం ఎదురైంది. తన పక్క బెడ్‌లో ప్రసవించిన మరో మహిళ పక్కన తన భర్త ఉన్నాడు. అది చూడగానే ఆమె షాక్ అయింది.

కాసేపు తన కళ్లను తాను నమ్మలేదు. అమెరికాకు చెందిన హెల్త్ వర్కర్.. చెప్పుకోలేనంత బాధ, ఆగ్రహం ఒకేసారి కట్టలు తెంచుకుని వచ్చాయి. ఒకవైపు ప్రసవానికి రెడీ అవుతూనే మరోవైపు భర్తను మరో మహిళతో చూసి తట్టుకోలేకపోయింది.


ఆ సమయంలో తాను ఎలా స్పందించిందో సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియోను రెడిట్ వెబ్ సైట్లో పోస్టు చేసింది.. ఈ వీడియోలో మిడ్ వైఫ్ గా పనిచేస్తున్న ఆమె తన ముఖానికి మాస్క్ ధరించి ఉంది. తన ముఖ కవలికలతో తనలోని ఆక్రోశాన్ని ఇలా వెలగక్కింది.Incredible moment a mum in labour discovers her husband’s mistress is at the same hospital giving birth

తనలోని హవాభావాలను బట్టి పరిశీలిస్తే.. భర్తను అక్కడే చితకబాదేంత కోపం ఉన్నట్టు కనిపిస్తోంది. గట్టిగా అరుస్తున్నట్టుగా ఉంది. ఏమి చెబుతుందో ఖచ్చితంగా తెలియదనిదిగా కనిపిస్తోంది. వీడియోను చూసినవాళ్లంతా కూడా పరేషాన్ అవుతున్నారు. ఈ వీడియోకు 2.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.


సాధారణంగా ఏ భార్య అయినా తన భర్త మరొకరితో కలలో కూడా ఊహించుకోదు. ఎవరితోనైనా అఫైర్ ఉన్నట్టు తెలిస్తే.. భర్త అని కూడా చూడదు.. భర్తతో కలిసి ఉన్న మహిళను కూడా చావ గొట్టకుండా ఊరుకోదు.. తన భర్త తనకు మాత్రమే సొంతమని, తనకు మాత్రమే భర్త ప్రేమంతా దక్కాలని భావిస్తుంటారు..

అదే కోరుకుంటుంటారు.. కానీ, చాలామంది భర్తలు.. తమ భార్యకు తెలియకుండా అఫైర్ నడుపుతుంటారు. ఏదో ఒక రోజున బయటపడటం.. పచ్చని సంసారాలన్నీ ముక్కలైపోతున్న ఘటనలు లేకపోలేదు.

Related Posts