Indecent behaviour with the doctor, suspended home guard

మహిళా డాక్టర్ ను వేధించిన కేసులో హోం గార్డు సస్పెండ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహిళా డాక్టర్ ను వేధించిన కేసులో ఒక హోం గార్డును నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. సుల్తాన్ బజార్  ప్రసూతి ఆస్పత్రిలో ఇంటర్నెషిప్ చేస్తున్న ఒక  వైద్యురాలు వారం రోజుల క్రితం తన విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆస్పత్రి నుంచి బయలు దేరింది.

మార్గ మధ్యంలో  లాక్ డౌన్ కారణంగా ముషీరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన  చెక్ పోస్టు లో విధుల్లో ఉన్న ట్రాఫిక్ హోం గార్డు  వెంకటేష్ ఆమెను ఆపి వివరాలు తీసుకున్నాడు. ఆమె  పేరు  ఇంటి  అడ్రస్ తో పాటు ఫోన్ నెంబరు కూడా తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె సెల్ ఫోన్ కు  అసభ్యకరమైన మెసేజ్ లు పంపించటం మొదలెట్టాడు. ఇది భరించలేని ఆ   మహిళా డాక్టర్ సదరు విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ నిందితుడైన హోం గార్డును సస్పెండ్ చేశారు. 

Read: బాలికపై లైంగిక దాడి..ఆపై వీడియో తీసి

Related Posts