లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

చివరి టెస్ట్‌లో భారత్ పోరాటం.. విజయానికి దగ్గరగా.. స్కోరు 213/3

Published

on

India:ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న భారత జట్టు.. చివరిదైన నాలుగో టెస్టులో గెలుపు కోసం పోరాడుతోంది. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ విజయం దిశగా పయనిస్తోంది. మొదట్లోనే కీలకమైన రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయినా.. గిల్.. పుజారా రాణించడంతో 328 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. విజయానికి 127పరుగుల దూరంలో ఉంది. 73ఓవర్లలో భారత్ 3వికెట్లు నష్టపోయి.. 213పరుగులు చేసింది.

నాలుగు పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆటను ప్రారంభించి టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురెబ్బ తగలింది. ఓపెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తరువాత మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో జతకట్టిన పుజారా ఇన్నింగ్స్‌‌ను ముందుండి నడిపించాడు. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద పెవీలియన్ చేరాడు. తృటిలో సెంచరీ మిస్ కాగా.. తర్వాత వచ్చిన కెప్టెన్‌ అజింక్యా రహేనే 24 పరుగులకే అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం భారత్‌ 3వికెట్ల నష్టానికి 213పరుగులు చేసి ఉంది. విజయానికి ఇంకా భారత్‌ 115 పరుగులు వెనకబడి ఉంది. ఇంక 27ఓవర్ల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం క్రిజ్‌లో పంత్‌(31), పుజారా(48) ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌట్ అవగా.. భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లను తీసుకున్నాడు. శార్దూల్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.