India 21-Day Lockdown: 10 Things You Need To Know

ఇండియా 21 రోజుల లాక్ డౌన్ : మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ భారతదేశాన్ని వదలడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 562కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 103 జిల్లాలో కోవిడ్ – 19 రోగులున్నట్లు నిర్ధారించారు. ఈ వైరస్ కారణంగా 9 మంది చనిపోయారని, ఢిల్లీలో రెండో మరణం సంభవించిందని తెలిపారు. కోవిడ్ – 19 వైరస్ ను ఎదుర్కొనడానికి 2020, మార్చి 24వ తేదీ మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

ప్రతి పౌరుడు ఇంట్లోనే ఉండాలని, వైరస్ వ్యాపించకుండా సహకరించాలని ఆయన కోరారు. కానీ రోజు వారి కూలీలు, పేదలు, కార్మికులు, నిరాశ్రయులు, నిరుద్యోగుల విషయంలో ఆర్థిక సహాయం గురించి ప్రస్తావించలేదు. 

1. మిజోరాం రాష్ట్రంలో తొలి కేసు.
మిజోరాం రాష్ట్రంలో కరోనా వైరస్ తొలి కేసు నమోదైంది. నెదర్లాండ్స్ కు చెందిన ఓ పాస్టర్ కు కోవిడ్ -19 లక్షణాలున్నట్లు గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాల్లో రెండోది. మొదటి కేసు మణిపూర్ లో ఓ విద్యార్థికి వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారు. 
2. కమల్ నాథ్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో జర్నలిస్టుకు కరోనా లక్షణాలు
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో జర్నలిస్టుకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. రాజీనామాకు ముందు ప్రసంగించిన సమయంలో ఇది బయటపడింది. ఈ విలేకరుల సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం…మధ్యప్రదేశ్ లో ఇప్పటికి 15 మందికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారు. 
3. లాక్ డౌన్ ఉన్నా..ఈ సేవలు తెరిచే ఉంటాయి. 
లాక్ డౌన్ సమయంలో ముఖ్యమైన సేవలు మాత్రం తెరిచే ఉంటాయని వెల్లడించింది. ఆహారం, కిరాణ, పండ్లు, కూరగాయు, పాడి, పాల బూత్, మాంసం, చేపలు, ఇతర మాంస పదార్థాలు తెరిచ ఉంటాయి. బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటీఎంలు పనిచేస్తాయి. ప్రింట్, ఎన్నికల మీడియా పనిచేస్తుంది. టెలికాం, ఇంటర్నెట్, కేబుల్ సేవలు కొనసాగుతాయి. పెట్రోల్ పంపులు, ఎల్ పీజీ, పెట్రోల్, గ్యాస్ రిటైల్, నిల్వ కేంద్రాలు తెరిచి ఉంటాయి. 
 

4.క్వారంటైన్ నిబంధనలు పాటించాలి
ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత..భారతేదేశానికి వచ్చిన ప్రతి వ్యక్తి..ఇంట్లోనే ఉండాలని హో మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరికి వైద్య సదుపాయం కల్పించాలని సూచించింది. స్థానిక అధికారులు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. సూచనలు పాటించకపోతే..ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం..చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 
5. మహారాష్ట్రలో 166కి పెరిగిన కేసులు. 
మహారాష్ట్రలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. 116కు చేరుకుంది. ఇది భారతదేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా చెప్పవచ్చు. ఇస్లాంపూర్ లోని ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులతో సహా..మరో 9 మందికి కోవిడ్ – 19 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. 
 

READ  స్పైస్ జెట్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారు: ప్రగ్యా సింగ్ ఠాకూర్

6. తమిళనాడు రాష్ట్రంలో తొలి కరోనా మరణం.
తమిళనాడు రాష్ట్రంలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇది తొలి మరణమని ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ వెల్లడించారు. తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా..రాజాజీ ఆసుపత్రిలోని ఎండీయూలో చికిత్స పొందుతున్న కోవిడ్ – 19 పాజిటివ్ లక్షణాలున్న రోగి కన్నుమూశాడన్నారు. రక్తపోటుతో పాటు, మధుమేహం వ్యాధి ఉందన్నారు. 
7. NPR జనాభా లెక్కల గణన వాయిదా
మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ క్రమంలో జాతీయ జనాభా రిజిష్టర్ (NPR) ను ఫస్ట్ ఫేజ్ సెన్సస్ 2021 వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 01వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. 
8. హైడ్రాక్సీ క్లోరోక్వైన్ ఎగుమతులపై నిషేధం
కోవిడ్ – 19 బారిన పడి రోగులకు చికిత్స అందిస్తున్న వారి కోసం యాంటీ మలేరియా డ్రగ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధితో బాధ పడుతున్న వారికి సేవలు చేస్తున్న హెల్త్ వర్కర్లు, హైడ్రాక్సీ క్లోరోక్వైన్ మందును వాడవచ్చని ఐసీఎంఆర్ వెల్లడించింది. క్వారెంటైన్ లో ఉన్న వ్యక్తితో పాటు ఉన్న వారు మాత్రమే ఈ మాత్రలు వేసుకోవాలని సూచించింది. 
9. ఫ్లిప్ కార్ట్ సేవల నిలిపివేత
కరోనా ఎఫెక్ట్ ఫ్లిప్ కార్ట్ సేవలపై పడింది. సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో తాము అమ్మకాలు జరపలేమని తెలిపింది. ప్రజలు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడించింది. 

10. లాక్ డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ పై ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. దీనిని అమలు చేయడానికి కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని తెలిపారు. 24 గంటల పాటు కర్ఫ్యూ, లేనిపక్షంలో కనిపిస్తే కాల్చివేత, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించుతామన్నారు. ఇలాంటి పరిస్థితి రానివ్వొద్దని 
2020, మార్చి 24వ తేదీ మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. 
 

Related Posts