లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భారత్ మీదుగా పాక్ ప్రధాని​ విమానం

Updated On - 3:51 pm, Tue, 23 February 21

India allows pakistam pm imran khan aircraft:భారత గగనతలం​ మీదుగా వెళ్లేందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానానికి అధికారులు అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంకలో తొలిసారి పర్యటించేందుకు ఇమ్రాన్ భారత గగనతలం మీదుగా​ వెళ్తున్నారు.

అయితే, 2019లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పాకిస్తాన్ గగనతలం మీదుగా సౌదీ వెళ్లేందుకు ఇమ్రాన్ సర్కార్​ అనుమతివ్వని విషయం తెలిసిందే. కశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో అనుమతి ఇవ్వలేదని సాకుగా చెప్పింది.

ఈ విషయంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు భారత్ ఫిర్యాదు కూడా చేసింది. సాధారణంగా దేశాధినేతల విమానాలకు అన్ని దేశాల ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుంటాయి. కానీ మోడీ విమానానికి పాక్ అనుమతి నిరాకరించి నిబంధనలు ఉల్లంఘించింది.