లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

వరల్డ్ బిగ్గెస్ట్ బయ్యర్ ఇండియా : 1.6 బిలియన్ డోస్‌ల కరోనా వ్యాక్సిన్ కొనేసింది!

Published

on

India biggest buyer of COVID-19 vaccine : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు వ్యాక్సిన్లు తొందరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే భారత్ పలు డ్రగ్ మేకర్ల నుంచి కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 1.6 బిలియన్ మోతాదులతో COVID-19 వ్యాక్సిన్లను భారత్ అత్యధికంగా కొనుగోలు చేసింది. దీంతో భారత అతిపెద్ద వ్యాక్సిన్ కొనుగోలుదారుగా అవతరించింది.ప్రపంచ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 800 మిలియన్ల మంది లేదా జనాభాలో 60 శాతం మందికి సరిపోయేంతగా కరోనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేసింది. అంటే.. 60 శాతం జనాభాకు 1.6 బిలియన్ల మోతాదు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. హెర్డ్ హ్యుమునిటీ అభివృద్ధి చెందడానికి ఇది సరిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 500 మిలియన్ మోతాదులు, యుఎస్ కంపెనీ నోవావాక్స్ నుండి ఒక బిలియన్, రష్యా గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి స్పుత్నిక్-V వ్యాక్సిన్ 100 మిలియన్ మోతాదులను భారత్ కొనుగోలు చేసినట్లు అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్శిటీ గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ సెంటర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.నవంబర్ 30 నాటికి ఈ మూడు కరోనా వ్యాక్సిన్లు మొత్తంగా 1.6 బిలియన్ మోతాదులను భారత్ కొనుగోలు చేయగా.. యుఎస్, యూరోపియన్ దేశాలు ఆరు వ్యాక్సిన్ల మోతాదులను కొనుగోలు చేశాయని Scale Speedometer విశ్లేషణలో పేర్కొంది. ఈ రెండు దేశాల కంటే కరోనా వ్యాక్సిన్ అత్యధిక మోతాదులను కొనుగోలు చేసిన భారత్.. అతిపెద్ద వ్యాక్సిన్ కొనుగోలుదారుగా నిలిచిందని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో యూరోపియన్ యూనియన్‌ 1.58 బిలియన్ల డోస్‌లను కొనుగోలు చేయగా.. అమెరికా ఒక బిలియన్ డోస్ లను కొనుగోలు చేసింది.

కరోనావైరస్ వ్యాప్తి నుంచి తమ జనాభాను రక్షించడానికి దేశాలు ఎక్కువ టీకా షాట్లను పొందటానికి ప్రయత్నిస్తున్నాయి. డ్యూక్ Duke University COVID-19 వ్యాక్సిన్ల కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి ప్రపంచ అంచనా జాబితాను విడుదల చేసింది. 2021 జూలై-ఆగస్టు నాటికి భారత్‌లో 250 నుంచి 300 మిలియన్ల (25 కోట్ల నుంచి 30 కోట్ల) ప్రజలకు 400-500 మిలియన్ మోతాదుల COVID-19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని గత నవంబర్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ తెలిపారు.భారత్ ప్రీ-బుకింగ్ చేసిన వ్యాక్సిన్లన్నింటినీ భారతీయ కంపెనీలు ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నోవావాక్స్, హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్-V అభివృద్ధి చేస్తున్నాయి. భారత్ బయోటెక్ భారతదేశ వ్యాక్సిన్ కూడా ఈ వారం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించింది.

భారత్ బయోటెక్ Zydus-Cadila కూడా ఏడాదికి 400 మిలియన్ మోతాదులను అందించనుంది. 2021లో మొదటి 250 మిలియన్లకు టీకాలు వేయాలని భావిస్తోంది. ఆ తరువాతి ఏళ్లలో మిగిలిన మోతాదులను వేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. మొదటి 500 మిలియన్ మోతాదులలో, ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, పారిశుధ్యం, అత్యవసర సేవలు, భద్రతా సేవలను ఈ బృందంలోని 250 మిలియన్ల మందికి అవకాశం ఉందని వైరాలజిస్ట్ చెప్పారు.ఈ గ్రూపులో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, కొమొర్బిడిటీ ఉన్న రోగులు కూడా ఉన్నారు. అధిక ఆదాయ దేశాలు ప్రస్తుతం 3.8 బిలియన్ మోతాదులను ధృవీకరించాయి. ఎగువ మధ్య-ఆదాయ దేశాలు 829 మిలియన్ మోతాదులను కలిగి ఉన్నాయి. తక్కువ మధ్య-ఆదాయ దేశాలు 1.7 బిలియన్ మోతాదులను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *