విశ్లేషణ: చైనా భారత్‌ల మధ్య ఫైవ్ పాయింట్ ఫార్ములా, చైనాను నమ్మగలమా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

India-China 5-point plan: చైనాను అర్ధంచేసుకోవాలంటే మనంకూడా చైనీయుల్లాగో ఆలోచించాలి. ఇప్పుడు ఇండియా చేస్తోంది అదే. ఎల్ఏసీ నుంచి వెనక్కి వెళ్లినట్లే వెళ్లి మళ్లీ వచ్చారు. బోర్డర్‌లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుగుతుండగానే గాల్లోకి ఫైర్ చేశారు. ఆనాటి పంచశీల సూత్రాలకు, ఎప్పుడో తూట్లు పొడిచారు.

మళ్లీ ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫార్ములా అంట. కొత్త రాగం అందుకున్నారు. గంటకో మాట.. పూటకో దుందుడుకు చర్యకు పాల్పడుతున్న చైనాను నమ్మొచ్చా!సరిహద్దుల్లో.. భారత్-చైనా ఆర్మీల బలగాల మోహరింపు ఎల్ఏసీ వెంబడి ఉన్న హీట్‌ని రెండింతలు చేసింది. ఇలాంటి టైంలో మాస్కో షాంఘై సహకార సంస్థ సదస్సులో రెండు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. బోర్డర్‌లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడమే ఎజెండా.

డ్రాగన్ తోక జాడిస్తే… భారత్ చూస్తూ ఊరుకుంటుందా? డ్రాగన్ తోక కట్ చేసే వ్యూహం పన్నుతుంది…


సరిహద్దు వెంట చైనా భారీ స్థాయిలో బలగాల్ని మోహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేసింది. ఓవైపు చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు సైనికులు, ఆయుధాల్ని సరిహద్దులకు చేరుస్తుండడంపట్ల తీవ్ర అభ్యంతరం. తక్షణమే బలగాల ఉపసంహరణను ప్రారంభించాలని నిర్ణయించారు. సుమారు 4 నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ఒప్పందం కుదరడం హాట్ టాపిక్.మాస్కోలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ వాంగ్ యీ మధ్య రెండున్నర గంటల పాటు సమావేశం సాగింది. సరిహద్దుల్లో, ఉద్రిక్తతల తగ్గింపు దిశగా ఫైవ్ పాయింట్ ఫార్ములాను ఫైనల్ చేశారు. చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సరిహద్దుల్లో అవలంబిస్తున్న దురుసు వైఖరి పట్ల భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

పాంగాంగ్‌లో చైనా సైన్యం మోహరింపు.. యుద్ధ విమానాలతో భారత్ రెడీ


సరిహద్దుల విషయంలో ఇరుదేశాల మధ్య 1993, 1996లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా సైనికులు ఉల్లంఘిస్తున్నారని తేల్చిచెప్పింది. సరిహద్దు నిర్వహణ విషయంలో కుదిరిన ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందే. భారత్‌ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని మరోసారి స్పష్టం చేసింది.భారత్-చైనా మధ్య సత్సంబంధాలకు సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఎంతో కీలకమని జైశంకర్‌ స్పష్టం చేశారు. అలా అయితేనే, ద్వైపాక్షిక బంధం సాఫీగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఉద్రిక్తతలు నెలకొన్న అన్ని ప్రాంతాల నుంచి వెంటనే బలగాల్ని ఉపసంహరించాలని జైశంకర్‌ తేల్చి చెప్పారు. చివరగా శాశ్వత స్థావరాలకు తమ బలగాల్ని తరలించే ప్రక్రియను మిలిటరీ కమాండర్లే ఖరారు చేయాలని రెండు దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.

Related Posts