చైనా – భారత సైన్యాల మధ్య మరోసారి ఘర్షణ – కేంద్రం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరోసారి దురాక్రమణ చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించింది. శాంతియుతంగా ఉన్న భారత భూబాగాన్ని కాపాడుకొనేందుకు సైన్యం శాంతియుతంగానే ఆ దేశ సైన్యాన్ని నిలువరించిందని చెప్పింది.దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతపూరిత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఈ క్రమంలో…ఈనెల 29వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించింది. ఘర్షణ నేపథ్యంలో చూషుల్ లో కమాండర్ స్థాయి అధికారులు ఫ్లాగ్ భేటీ నిర్వహిస్తున్నారు. భారత్ – చైనా సరిహద్దు సమస్య పరిష్కారంపై చర్చలు కొనసాగుతున్నాయి.

చైనా తీరు మారడం లేదు. ఏదో ఒక విధంగా భారత సరిహద్దులో చొచ్చొకొని వచ్చేందుకు ఆ దేశ సైన్యం ప్రయత్నిస్తోంది. మే 05వ తేదీ నుంచి జూన్ నెల వరకు ఉద్రిక్తతలు కొనసాగాయి. 20 మంది సైనికులను చైనా ఆర్మీ పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.తూర్పు లద్దాఖ్ ప్రాంతంపై చైనా ఫోకస్ పెట్టింది. భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకులను, యుద్ధ సామాగ్రీని మోహరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా సైనికులు మోహరించి..భారత ఫోకస్ ను మళ్లించేయత్నం చేస్తోందని సమాచారం. తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన ఘటన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

పాక్, చైనాతో కలిసి రష్యా లో భారత దళాల మిలిటరీ ఎక్సర్ సైజ్


దేశ రక్షణ విషయంలో భారత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. చైనా పై సై అంటే సై అంటోంది. భారత్‌- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్‌ దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఒక కీలక యుద్ధ నౌకను భారత్ మోహరించింది.దక్షిణ చైనా సముద్రంలో భారత్ యుద్ధ నౌక మోహరింపుపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల తమ సైనిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతున్నదని పేర్కొంది. మరోవైపు హిందూ మహా సముద్రంలో యుద్ధ నౌకలను భారత్ భారీగా మోహరించింది. చైనా రవాణా నౌకలు ప్రయాణించే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని మలక్కా స్ట్రెయిట్స్‌పై పూర్తి నిఘాను పెట్టింది.

భారత్‌లోని శత్రుదుర్భేధ్యమైన మిలటరీ బేస్‌ల మీద కూడా చైనా ఓ కన్నేసి ఉంచింది. ఎప్పటికప్పుడు.. ఇండియన్ ఆర్మీ కదలికలను గమనించే ప్రయత్నం చేస్తోంది. అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌బేస్, ఒడిశా తీరంలోని.. మిస్సైల్ టెస్టింగ్ సెంటర్.. అబ్దుల్ కలాం ఐల్యాండ్‌ని చైనా నిశితంగా పరిశీలిస్తోంది.ఈ రెండు ప్రదేశాలు.. భారత్‌కు వ్యూహాత్మక, సైనిక సామర్థ్యాలకు చాలా కీలకమైనవి. మయన్మార్ సరిహద్దులో ఉన్న యునాన్ ప్రావిన్స్‌లోని రుయిలీ కౌంటీ నుంచి చైనా ఈ కీలకమైన ప్రదేశాలని గమనిస్తోంది. ఇండో-చైనా బోర్డర్‌కు 170 కిలోమీటర్ల దూరంలో.. తేజ్‌పూర్ ఎయిర్‌బేస్ ఉంటుంది.

READ  మీ సహకారం మరువలేనిది...దేశ ప్రజలకు మోడీ థ్యాంక్స్

Related Posts