India-China Conflict..Surat people breaking china-made TV to protest against China.

బాయ్ కాట్ చైనా : మేడిన్ చైనా స్మార్ట్ టీవీని బద్దలుకొట్టి నిసనలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సరిహద్దులో చైనా సైన్యం చేసిన దాడిలో   20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు డ్రాగన్ దేశంపై భగ్గుమంటున్నారు. డ్రాగన్ పొగరు అణచాలని..దానికి తగిన శాస్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతమంతా ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రతినలు చేస్తున్నారు. చైనా వస్తువులను బహిష్కరిస్తున్నారు.

వారి వారి ఇళ్లల్లో ఉండే మేడిన్ చైనా వస్తువులను బద్దలు కొడుతూ చైనాపై తమకున్న ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు భారతీయులు.  దేశవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్న క్రమంలో పలుచోట్ల చైనా సరుకులను ధ్వంసం చేస్తున్నారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో  విదేశీ వస్తుబహిష్కరణను గుర్తుకు తెస్తూ..మేడిన్ చైనా వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. 

ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం వద్దకు మాజీ సైనికులు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసనలు వ్యక్తం చేశారు.చైనాకు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తూ..పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  

గుజరాత్‌లోని సూరత్‌లో చైనా వస్తువులను ధ్వంసం చేశారు. ఓ వ్యక్తి తన అపార్ట్‌మెంటులోంచి మేడిన్ చైనా టీవీని కింద పడేశాడు. పశ్చిమ బెంగాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. సిలిగిరిలోని ప్రఖ్యాత హాంకాంగ్ మార్కెట్ పేరును మార్చేశారు. మార్కెట్లో చైనా వస్తువుల అమ్మాకాలను కూడా బ్యాన్  చేశారు. ‘మేం చైనా వస్తువులను అమ్మం. దేశీ వస్తువును కొనాలని కస్టమర్లకు చెబుతామంటున్నారు. 

మార్కెట్‌కు ఏ పేరు పెట్టాలో ఆలోచిస్తున్నాం..’ అని మార్కెట్ కమిటీ చైర్మన్ తపన్ సాహా చెప్పారు. బెంగాల్, యూపీ తదితర చోట్లు స్వదేశీ వస్తువులను ప్రోత్సాహించాలని, మేడిన్ చైనా సరుకులను బహిష్కరించాలని పలు ప్రాంతాల్లో ర్యాలీలు తీశారు. ఇలా భారతదేశ వ్యాప్తంగా డ్రాగన్ దేశంపై నిసనలు వెల్లువెత్తుతున్నాయి.  

సరిహద్దుల్లో గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా వద్ద చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. 1975 తర్వాత భారత్, చైనాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో అత్యధిక ప్రాణనష్టం జరిగిన ఘటన ఇదే కావడం గమనించాల్సిన విషయం. చైనా దుస్సాహసాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్… సరైన గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. దీనికి చైనా తగిన శాస్తి అనుభవించాల్సి వస్తుందని భారత అధికారులు అంటున్నారు.

Read: భారత్ ప్రతీకారం.. చైనా ఉత్పత్తులను బ్యాన్ చేసిన బీఎస్ఎన్ఎల్

Related Posts