india chinese troops clash at border

బోర్డర్ లో కొట్టుకున్న భారత్-చైనా సైనికులు, పలువురికి గాయాలు, అసలేం జరిగిందంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో

భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువైపులకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు. వారికి స్వల్ప గాయాలైనట్లు ఓ అధికారి తెలిపారు. సిక్కింలోని నకులా సెక్టార్ లో శనివారం(మే 9,2020) ఈ ఘటన జరిగింది. మొత్తం 150 మంది సైనికులు ఒకరికొకరు తలపడ్డట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. దీంతో చైనాకు చెందిన ఏడుగురు, భారత్ వైపు నలుగురు సైనికులకు గాయాలైనట్లు అధికారి వెల్లడించారు. రోజువారీ గస్తీలో భాగంగా ఇరువైపుల వారు తారసపడ్డప్పుడు ఘర్షణ తలెత్తినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించారు.

2017లో డోక్లాంలో 73 రోజుల పాటు రగడ:
చివరిసారి సెప్టెంబర్ 2019లో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని పాంగోంగ్ సో సరస్సు తీరంలో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. తర్వాత చర్చల ద్వారా వివాదం వెంటనే సద్దుమణిగింది. అంతకుముందు డోక్లాంలో 2017లో సుదీర్ఘంగా 73 రోజుల పాటు ఇరు దేశాల బలగాలు తలపడ్డాయి. భూటాన్ లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లాంలో రహదారిని చైనా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ.. భూటాన్ కు మద్దతుగా భారత సైనిక బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దీన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టకేలకు విస్తృత దౌత్యపరమైన చర్చల అనంతరం ఇరుదేశాలు వెనక్కి తగ్గాయి. దీంతో వివాదం సద్దుమణిగినా.. డోక్లాం సమస్యకు మాత్రం ఇంకా పూర్తి స్థాయి పరిష్కారం లభించలేదు.

భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు డ్రాగన్ కుట్ర:
భారత్‌ భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను భారత ఆర్మీ దీటుగా ఎదుర్కొంది. దీంతో డ్రాగన్‌ తోక ముడిచింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనికులూ ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ‘ప్రోటోకాల్ ప్రకారం సరిహద్దుల్లో ఇటువంటి సమస్యలను సేనలు పరస్పరం పరిష్కరిస్తాయి. ఈ సంఘటన చాలా కాలం తరువాత జరిగింది’ అని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దుకు ఇరువైపుల అవగాహన లోపంతో కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. డోక్లాం తమదేనని అటు చైనా, ఇటు భూటాన్ వాదిస్తున్నాయి. భూటాన్ వాదనకు భారత్ మద్దతిస్తోంది. ఈ సమయంలో చైనా బెదిరింపులకు తలొగ్గకుండా పట్టుదలతో వ్యవహరించి భారత్ విజయం సాధించింది. సిక్కిమ్ సరిహద్దుల్లోని డోక్లామ్‌లో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ సైన్యం అడ్డుకుంది. దీనిపై చైనా కూడా ఒకింత ఆశ్చర్యానికి గురైంది.

READ  రుణాలు చెల్లించేందుకు అంగీకరించండి...కేసులు మూసేయండి

యుద్ధానికి రెచ్చగొట్టిన చైనా:
డోక్లామ్‌లో చైనా సేనలను అడ్డుకుని తీవ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడుల కంటే ప్రమాదకరమైన నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారు. చైనా యుద్ధానికి రెచ్చగొట్టినప్పటికీ ఇరు దేశాల మధ్య శాంతియుత చర్చలు ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించింది. చర్చల ద్వారా సమస్య పరిష్కారమైనా అనేకసార్లు వివాదాన్ని చైనా రాజేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రాంతానికి సమీపంలో సొరంగాలు, బ్యారక్‌‌ల లాంటి భారీ నిర్మాణాలను చేపట్టింది. దీన్ని కూడా భారత్ సమర్ధంగా ఎదుర్కొంది.

భారత్-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఈ ప్రాంతంలో ఉండే అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగమేనని, దక్షిణ టిబెట్‌గా చైనా పేర్కొంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి.

Read Here: సిక్కింలో భారత్, చైనా బలగాల మధ్య గొడవ, పలువురికి గాయాలు

Related Posts