దేశంలో అరకోటికి దగ్గరగా.. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారతదేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు సంఖ్య అరకోటికి దగ్గరగా అవుతుండగా.. గత 24 గంటల్లో దేశంలో 97,570 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్ 10వ తేదీన రికార్డు స్థాయిలో 96,551 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24 గంటల్లో 1,201 మంది ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి దేశంలో ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా మరణిస్తూ వస్తున్నారు. అయితే కాస్త ఉపశమనం కలిగించే వార్త ఏమిటంటే ఇప్పటివరకు 24 గంటల్లో 81,533 మంది రోగులు కోలుకున్నారు.




ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క తాజా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 46 లక్షల 60 వేలకు చేరుకుంది. వీరిలో 77,472 మంది చనిపోయారు. క్రియాశీల కేసుల సంఖ్య విషయానికి వస్తే.. 9 లక్షల 58 వేలకు చేరుకుంది. మొత్తం కేసుల్లో 36 లక్షల 24 వేల మంది కోలుకున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తుల సంఖ్య చురుకైన కేసుల సంఖ్య కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది.



ఐసిఎంఆర్ లెక్కల ప్రకారం 50 మిలియన్లకు పైగా నమూనాలను ఇప్పటివరకు దేశంలో పరీక్షించారు. సెప్టెంబర్ 11వ తేదీ వరకు మొత్తం 5 కోట్ల 50 లక్షల నమూనా పరీక్షలు జరగగా.. వీటిలో 11 లక్షల నమూనాలను నిన్న పరీక్షించారు. పాజిటివిటీ రేటు 7 శాతం కన్నా తక్కువగా ఉంది. కరోనా వైరస్ కేసులలో 54% 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నవారే ఉన్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా 51% మరణాలు 60 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో సంభవించాయి.

నా దగ్గర ఆధారాలు ఉన్నాయ్.. కరోనా వైరస్‌ను వూహన్‌ ల్యాబ్‌లో పుట్టించారు: చైనీస్ శాస్త్రవేత్త


క్రియాశీల కేసు రేట్లలో స్థిరమైన క్షీణత నమోదు కాగా.. ఉపశమనం కలిగించే విషయం. మరణాల రేటు 1.66% కి పడిపోయింది. ఇది కాకుండా, చికిత్స పొందుతున్న క్రియాశీల కేసుల రేటు కూడా 21% కి పడిపోయింది. దీనితో, రికవరీ రేటు 78% గా ఉంది. భారతదేశంలో రికవరీ రేటు నిరంతరం పెరుగుతూ వస్తుంది.




దేశంలో మహారాష్ట్రలో అత్యంత ఎక్కువగా చురుకైన కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఆసుపత్రులలో రెండు లక్షలకు పైగా కరోనా సోకిన వారు చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రెండో స్థానంలో, ఢిల్లీ మూడో స్థానంలో, గుజరాత్ నాలుగవ స్థానంలో, పశ్చిమ బెంగాల్ ఐదో స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యంత చురుకైన కేసులు ఉండగా.. క్రియాశీల కేసుల విషయంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. అమెరికాలో మాత్రమే భారత్‌లో కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి.

READ  అందమైన దేశం అలా : ఇటలీలో 10వేలు దాటిన కరోనా మరణాలు

Related Posts