లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

కరోనా వ్యాక్సిన్లకు హాట్‌స్పాట్‌గా భారత్.. 60శాతానికి పైగా మన దగ్గరే..

Published

on

కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. ప్రపంచ దేశాల్లో వందలాది కరోనా వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వందలాది డ్రగ్ మేకర్లు భారత్ వైపు చూస్తున్నారు. మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు అనువైన స్పాట్లను ఎంచుకుంటున్నారు.వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక సులభంగా తమ షాట్లను గ్లోబల్‌గా పంపిణీ చేసేందుకు వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాక్సిన్లు పంపిణీ చేయడం సవాల్ తో కూడుకున్న పని.అందుకే తమ వ్యాక్సిన్లను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు డ్రగ్ మేకర్లు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా భారత వ్యాక్సిన్ మేకర్లకు కూడా 60 శాతానికి పైగా అన్ని వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు మార్గం సుగమం చేసింది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లకు భారత్ ప్రధాన కేంద్రంగా మారింది.ప్రపంచంలోనే అతిపెద్ద పంపిణీదారు సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా (SII)తో ఇప్పటికే పలు అంతర్జాతీయ డ్రగ్ కంపెనీలు ఒప్పందం కుదర్చుకున్నాయి. అంతర్జాతీయ కరోనా వ్యాక్సిన్లను సీరం తమ భాగస్వామ్యంలో ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు పంపిణీ చేయనుంది.

AstraZeneca కూడా సీరమ్‌తో లైసెన్స్ డీల్‌పై సంతకం చేసింది. ఆక్స్ ఫర్డ్ రీసెర్చర్లు అభివృద్ధి చేసిన అడినోవైరస్ వెక్టార్ వ్యాక్సిన్ 1 బిలియన్ డోసులను సీరమ్ తయారుచేయనుంది. ప్రస్తుతం ఈ వెక్టార్ వ్యాక్సిన్‌పై మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి.భారత్‌ సహా తక్కువ మధ్య-ఆదాయ దేశాల(LMIC)లో ప్రిఫ్యూజన్ ప్రోటీన్ అయిన NVX CoV2373 అభివృద్ధి వాణిజ్యీకరణ కోసం నోవావాక్స్ సీరమ్‌తో ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ మధ్యలో ఎండీ ఆధారిత వ్యాక్సిన్ మేకర్ Gaithersburg సీరమ్ తో ఒప్పందాన్ని పొడిగించింది.

నోవాక్స్ ఒప్పందంలో భాగంగా వార్షికంగా రెండు బిలియన్లకు పైగా డోస్ లను సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2021 మధ్య ఏడాదిలోగా ఈ ప్రణాళిక మొత్తాన్ని ఆన్ లైన్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేసింది.భారత్, LMIC దేశాలకు కనీసం ఒక బిలియన్ NVX-CoV2373 డోస్‌లను అందించనున్నట్టు అంచనా వేస్తోంది. గత నెలలోనే సీరమ్ సంస్థ CDX-005 వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. ముక్కు ద్వారా వేసే ఈ వ్యాక్సిన్ ను Codagenix Inc కరోనా నివారణ కోసం అభివృద్ధి చేసింది. ఒప్పందంలో భాగంగా సీరమ్ 2021 నాటికి 100 మిలియన్లకు పైగా కరోనా వ్యాక్సిన్లను తయారు చేయనుంది.COVAX Facility తయారైన కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేయనుంది. మహారాష్ట్ర అధారిత కంపెనీలో నెలకు 60 నుంచి 70 మిలియన్ల డోస్ లను తయారుచేయగల సామర్థ్యం ఉంది. ప్రపంచ డ్రగ్ మేకర్లు అభివృద్ధి చేసిన అనేక కరోనా షాట్లను ఇండియాలో తయారు చేసేందుకు సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *