భారతీయుల ఆయుర్దాయం.. గతం కంటే పెరిగిందా? తగ్గిందా? తాజా సర్వే ఏం చెబుతోంది?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారతీయుల ఆయుర్దాయం.. గతం కంటే పెరిగిందా తగ్గిందా? ఏఏ రాష్ట్రాల్లో ఎలా..తాజాగా లాన్సెట్ అనే హెల్త్ మాగజైన్ నిర్వహించిన సర్వే ఏం చెబుతోందో తెలుసుకుందాం..


ప్రపంచ దేశాల కన్నా భారతీయుల ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి. కరోనా సమయంలో కూడా పాశ్చత్యదేశాల కంటే మన దేశంలోనే మరణాల సంఖ్య తగ్గువగా ఉండటం గమనించాల్సిన విషయం. అభివృద్ధి చెందిన దేశాలను చెప్పుకునే దేశాల కంటే భారత్ లో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య తక్కువగా ఉందని పలు గణాంకాలువెల్లడించాయి.


కరోనా వైరస్ సమయంలో మనం నిత్యం కూరల్లో వాడే పసుపును పలు దేశాలవారు తినటం అలవాటు చేసుకున్నారు. వారి ఆహారంలో ఉపయోగింంచుకుని తిన్నారనే విషయం కూడా తెలిసిందే. పసుపులో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. ఇండియన్స్‌లో రోగనిరోధక శక్తి బాగానే ఉంటుందని అభిప్రాయాలు వెల్లడయ్యాయి.ఈ క్రమంలో భారతీయుల ఆయుర్దాయం గతంలో కన్నా ఇప్పుడు పెరిగిందని ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ జర్నల్ తన తాజా నివేదికలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకుంది. గత 30 ఏళ్లలో భారతీయులు ఆయిష్సు పెంచుకున్నారని తెలిపింది.


భారతదేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70.8 ఏళ్లకు పెరిగిందని తన తాజా నివేదికలో పేర్కొంది. 90వ దశకంలో భారతీయుల సగటు ఆయుష్షు 59.6గా ఉందని, 2019 నాటికి అది గణనీయంగా 70.9కి పెరిగిందని తెలిపింది. ష్టంచేసింది. అదే కేరళలో సగటు జీవితకాలం 77.3 సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్ లో 66.9 సంవత్సరాలకు పెరిగిందని తెలిపింది.


లాన్సెట్ నివేదికపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్పందిస్తూ.. ‘భారతీయుల సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ వారు సంతోషంగా జీవిస్తున్నట్టు భావించలేమని వ్యాఖ్యానించింది. భారతీయులు పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతురని..భారత ప్రజలు అనుకున్నంత ఆరోగ్యంగా లేరు’ అని వివరించింది.
బీపీ, షుగర్ లతో బాధపడుతున్నారనీ..అలాగే దేశంలో పొగాకు వాడకం..కాలుష్యం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారని తెలిపింది.


అలాగే ఈనాటికి భారతదేశంలో ప్రసూతి మరణాలుకూడా ఎక్కువగానే ఉన్నాయనీ..ఇదిక్రమేపీ తగ్గుతోందని ఇది మంచి పరిణామమని పేర్కొంది. హృదయ సంబంధిత వ్యాధుల్లో భారత్ 5వ స్థానంలో ఉందని తెలిపింది. క్యాన్సర వ్యాధులు కూడా భారత్ లో పెరుగుతున్నాయనీ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్ మోక్దాద్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఇ) తెలిపింది.

Related Posts