లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

వందే భారత్ : దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు

Published

on

Picture

తెలంగాణ భవన్ లో గణతంత్ర వేడుకలు

26/1/2021,12:00PM

తెలంగాణ భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ పతకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

తెలంగాణ హైకోర్టులో జాతీయ జెండాను చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ ఆవిష్కరించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను గవర్నర్ తమిళి సై ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళలుర్పించారు.

Picture

ఇండియా గేట్ వద్ద అమరవీరులకు ప్రధాని మోడీ,రాజ్ నాథ్ నివాళులు

26/1/2021,11:37AM

ఇండియా గేట్ వద్ద అమరవీరులకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. అమర్ జవాన్ జ్యోతి వద్ద సైనికులకు మోడీ, రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. 55ఏళ్ల తర్వాత ముఖ్య అతిథి లేకుండా గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు త్రివర్ణ పతకాలతో అలంకరించారు. ఐదంచెల భద్రతా వలయంలో సెంట్రల్ ఢిల్లీ వరకు మోహరించారు.

Picture

ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

26/1/2021,10:58AM

విజయవాడ వేడుకల్లో ఏపీ గవర్నర్, సీఎం జగన్ పాల్గొన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు.

గణతంత్ర వేడుకల్లో సీఎం జగన్, మంత్రులు, సీఎస్, డీజేపీ పలువురు పాల్గొన్నారు. అసెంబ్లీ వద్ద జాతీయ జెండాను స్పీకర్ తమ్మినేని ఆవిష్కరించారు.

శాసనమండలి వద్ద జాతీయ జెండాను చైర్మన్ షరీఫ్ ఆవిష్కరించారు. సచివాలయం వద్ద జాతీయజెండాను స్సెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ఆవిష్కరించారు.

Picture

రాజ్ ఫథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

26/1/2021,10:58AM

రాజ్ ఫథ్‌లో 72వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు.

త్రివద దళాల గౌరవ వందనాన్ని కోవింద్ స్వీకరించారు. గణతంత్ర వేడుకలకు ఉపరాష్టప్రతి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు హాజరయ్యారు.

Picture

ప్రత్యేక ఆకర్షణగా సైనిక విన్యాసాలు

26/1/2021,10:25AM

పరేడ్ లో సైనిక కవాతులో 122 మంది బంగ్లాదేశ్ సైనికులు పాల్గొన్నారు. 38 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు విన్యాసాలను ప్రారంభించాయి.

రఫెల్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గణతంత్ర పరేడ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 శకటాలు కూడా ఉన్నాయి. ఏపీ, గుజరాత్, యూపీ, అసోం, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Picture

ఘనంగా గణతంత్ర వేడుకలు

26/1/2021,10:20AM

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు.  ప్రధాని మోదీ దేశ ప్రజలకు గణంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *