లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సిరాజ్, బుమ్రాలపై జాతి వివక్ష చూపిస్తున్నారంటూ టీమిండియా కంప్లైంట్

Published

on

Mohammad Siraj: టీమిండియా మేనేజ్మెంట్ జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ లు జాతి వివక్షకు గురయ్యారంటూ.. నిందితులపై కంప్లైంట్ చేసింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓ గుంపు వారిపై ద్వేషపూరిత కామెంట్లు చేశారని ఆరోపించింది. టెస్టు మ్యాచ్ వరుసగా రెండు, మూడో రోజుల్లో ఈ ఘటన జరిగింది.

ఈ విషయాన్ని సీనియర్ ప్లేయర్లు కెప్టెన్ అజింకా రహానె, రవిచంద్రన్ అశ్విన్ లు పాల్ రీఫెల్, పాల్ విల్సన్ అనే ఇద్దరు అంపైర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఇష్యూపై స్పందించాలని కోరారు. ఇండియన్ ప్లేయర్లు, అంపైర్లు, సెక్యూరిటీ అఫీషియల్స్ మధ్య కాసేపటి వరకూ సంభాషణ జరగ్గా ఆ సమయంలో మ్యాచ్ ఆపేశారు.

ఇండియన్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో అలజడి మొదలవడంతోనే ఇండియా సెక్యూరిటీ అఫీషియల్స్ గ్రౌండ్ లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ తో చర్చలు జరిపారు. దాంతో పాటు ఐసీసీ సెక్యూరిటీ అధికారితోనూ మాట్లాడుతున్నారు.