లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కి అండగా భారత్

Published

on

India Stands With France In Fight Against Terrorism ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కి భారత్ అండగా ఉంటుందని ప్రధాని మోడీ సృష్టం చేశారు. ఫ్రాన్స్ లోని నీస్ సిటీలో ఇవాళ జరిగిన ఉగ్రదాడితో సహా ఇటీవల కాలంలో ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడులను చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మరియు ఫ్రాన్స్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోడీ. రాడికల్ ఇస్లాం పట్ల కఠినమైన వైఖరిని అనుసరించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌పై వ్యక్తిగత దాడులను భారత్ బుధవారం తీవ్రంగా ఖండించింది, ఇది అంతర్జాతీయ ఉపన్యాసం యొక్క ప్రాథమిక ప్రమాణాల ఉల్లంఘన అని పేర్కొంది.ఒక ఫ్రెంచ్ ఉపాధ్యాయుడిని… 18 ఏళ్ల ముస్లిం యువకుడు దారుణంగా హత్య చేసిన ఘటనను కూడా భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ఏ కారణం చేతనైనా లేదా ఏ పరిస్థితులలోనైనా ఉగ్రవాదానికి ఎటువంటి సమర్థన లేదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. కాగా, కొద్ది రోజుల క్రితం మహమ్మద్‌ ప్రవక్త వివాదాస్పద కార్టూన్లను విద్యార్ధులకు చూపిస్తున్నారన్న కారణంతో ఆగ్రహించిన 18 ఏళ్ల ముస్లిం యువకుడు ఒక ఫ్రెంచ్‌ టీచర్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యకు వ్యతిరేకంగా, భావ ప్రకటన స్వచ్ఛకు మద్దతుగా ఫ్రాన్స్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి.ఫ్రెంచ్‌ ఉపాధ్యాయుడి హత్య తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌ చేసిన కామెంట్లు ఇస్లామిక్‌ దేశాలకు ఆగ్రహం తెప్పించాయి. ఉపాధ్యాయుడి హత్యను ఇస్లామిక్‌ టెర్రరిస్టు దాడిగా అభివర్ణించిన మేక్రాన్….. మహమ్మద్‌ ప్రవక్త వివాదాస్పద కార్టూన్‌ల ప్రదర్శనను సమర్ధించారు. ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బతింటాయని భావ ప్రకటనా స్వేచ్ఛను వదులుకోలేమని మేక్రాన్‌ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం అంటే ఫ్రాన్స్‌ సమగ్రతను దెబ్బతీయడమేనని మేక్రాన్‌ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లోని 60 లక్షలమంది ముస్లింలు ప్రధాన జీవన స్రవంతి నుంచి దూరంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అసలు ఇస్లాం మతమే సంక్షోభంలో ఉందని మేక్రాన్ వ్యాఖ్యానించారుమేక్రాన్‌ ప్రకటనకు నిరసనగా ఫ్రాన్స్‌లో తయారైన వస్తువులను బహిష్కరించాని పలు ముస్లిం దేశాలు పిలుపు నిచ్చాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మత విశ్వాసాలను గుర్తించడం లేదని, ఫ్రాన్స్‌లో లక్షలమంది ముస్లింల స్వేచ్ఛను హరిస్తున్నారని టర్కీ, పాకిస్తాన్‌ దేశాలు ఆరోపించాయి.ఇదే సమయంలో ఫ్రాన్స్ లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఫ్రాన్స్‌లోని నీస్ సిటీలో నాట్రేడేమ్‌ చర్చి సమీపంలో గురువారం(అక్టోబర్-29,2020)కత్తితో ఓ దుండగుడు “అల్లాహ్ అక్బర్” అని పెద్దగా జరిపిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఉగ్రవాద చర్యేనని నీస్‌ మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్త్రోసి తెలిపారు. ఫ్రాన్స్ లో గడిచిన రెండు నెలల్లో ఇది మూడవ ఎటాక్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *