లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

వ్యాక్సిన్ ఇండియా : రెండో డోసు వేసుకున్న 14 రోజుల్లోనే యాంటీబాడీలు

Published

on

India Starts 'world's largest' vaccination campaign on Jan 16
Picture

టీకా పడింది.. గాంధీలో పారిశుధ్య కార్మికురాలికి తొలి టీకా

16/1/2020,11:19AM

గాంధీలో మంత్రి ఈటల ఆధ్వర్యంలో తొలి టీకాను పారిశుధ్య కార్మికురాలికి టీకా వేశారు.

Picture

తెలంగాణలో ప్రారంభమైన వ్యాక్సినేషన్

16/1/2020,11:29AM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. కరోనా వ్యాక్సినేషన్ ను నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.

Picture

రెండో డోసు వేసుకున్న 14 రోజుల్లోనే యాంటీబాడీలు అభివృద్ధి

16/1/2020,11:19AM

రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోడీ సూచించారు. వ్యాక్సిన్ వచ్చిందని జాగ్రత్తలు మరవద్దని అన్నారు. వ్యాక్సిన్ పై అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. మన వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా నమ్మకముందని అన్నారు. మన పరిస్థితులకు అనుగుణంగానే వ్యాక్సిన్లు తయారయ్యాయని తెలిపారు. ప్రాణాలు అడ్డుపెట్టారు కాబట్టే ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి టీకాను అందిస్తున్నామన్నారు. నిస్వార్థసేవకు గుర్తింపుగానే వారియర్స్ కు మొదటి టీకాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

Picture

ఒకటి కాదు రెండు వ్యాక్సిన్లు.. మేడ్ ఇన్ ఇండియా..

16/1/2020,11:15AM

రెండో డోసు వేసుకున్న 14 రోజుల్లోనే యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. అప్పటివరకూ ఎలాంటి అలసత్వం పనికిరాదన్నారు. ఇకముందు కూడా అదే పోరాటం కొనసాగించాలని మోడీ ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన సైంటిస్టులకు మోడీ అభినందనలు తెలిపారు. పగలు రాత్రి శ్రమించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా కొన్ని వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమంగా ప్రధాని అభివర్ణించారు.

Picture

30కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చేది ఇండియా, చైనా, అమెరికా మాత్రమే

16/1/2020,11:11AM

30కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చేది ఇండియా, చైనా, అమెరికా మాత్రమేనని మోడీ తెలిపారు. ఎన్నో సవాళ్ల మధ్య కరోనా వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు. మీరందరూ ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చేసిందని తెలిపారు. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూసిందని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు వచ్చాయని అన్నారు.

Picture

తొలి దశలో 3 కోట్ల మందికి ఉచితంగా టీకా

16/1/2020,11:08AM

కొన్నినెలలుగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. చాలా తక్కువ టైంలో వ్యాక్సిన్ తీసుకొచ్చామన్నారు. తొలిదశలో 3 కోట్ల మందికి ఉచితంగా టీకా అందిస్తున్నామని మోడీ చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్ల తర్వాత సైనికులు, 50ఏళ్లు పైబడిన వారికి ఇస్తామన్నారు.

Picture

మోడీ నోట.. గురజాడ మాట..

16/1/2020,10:40AM

దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులన్న గురజాడ కవితను ప్రధాని మోడీ ప్రస్తావించారు. సొంతలాభం కొంతమానుకుని పొరుగువారికి తోడ్పడవోయ్.. గట్టిమేలు తలపెట్టవోయ్.. అన్నారు. ఈ స్ఫూర్తితో ముందుకు నడవాలని మోడీ అన్నారు. ఒకటి కాదు.. రెండు వ్యాక్సిన్ లు వచ్చాయి.. అవీ మేడ్ ఇన్ ఇండియా అంటూ ప్రసంగించారు. ఇవే కాదు.. మరికొన్ని వ్యాక్సిన్ లు కూడా వస్తున్నాయని మోడీ అన్నారు.

Picture

శాస్త్రవేత్తల కృషి వల్లే రెండు వ్యాక్సినేషన్‌లు వచ్చాయి

16/1/2020,10:40AM

శాస్త్రవేత్తల కృషి వల్లే రెండు వ్యాక్సినేషన్ లు వచ్చాయని, రాత్రింబవళ్లు వ్యాక్సిన్ కోసం పని చేశారని చెప్పారు. మరికొన్ని వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మనుషుల సంకల్పం ముందు బండలు కరుగుతాయని, రామాయణకాలంలో అప్పుడు రుజవైందని, మళ్లీ ఇప్పుడు రుజువైందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తొలి టీకాకు హక్కుదారులన్నారు. మొదటి టీకా తీసుకున్న తర్వాత..రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలనే సమాచారం వారి వారి ఫోన్ ల ద్వారా సమాచారం అందివ్వడం జరుగుతుందన్నారు. రెండు డోస్ లు తప్పనిసరిగా తీసుకోవాలని, మరిచిపోవద్దన్నారు.

Picture

వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదే..

16/1/2020,10:40AM

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2021, జనవరి 16వ తేదీ శనివారం ఉదయం 10.30 వ్యాక్సినేషన్ వర్చువల్ విధానం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కొన్ని నెలల నుంచి కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పుడా ఆ సమయం వచ్చిందన్నారు. చాలా తక్కువ సమయంలోనే టీకా వచ్చిందని వెల్లడించారు.

Picture

ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్

16/1/2020,10:15AM

భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా (జనవరి 16 నుంచి) శనివారం ఉదయం 10 గంటలకు వర్చువల్‌ విధానంలో మోడీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తొలి దశలో భాగంగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు దేశవ్యాప్తంగా 3 వేల 6 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి టీకాలు ఇవ్వనున్నారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్‌ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హెల్త్‌కేర్ వర్కర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.