లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బ్రెజిల్ కు భారత్ కరోనా వ్యాక్సిన్

Published

on

Brazil : టీకా వ్యాక్సిన్‌ ద్వారా మరోసారి భారత్‌ తన బలాన్ని చాటుకొంటోంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌లకు టీకాలను సరఫరా చేసింది. తాజాగా..బ్రెజిల్ కు  వ్యాక్సిన్ల సరఫరాకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం..బ్రెజిల్, మొరాకోకు రవాణా చేయనున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి వెల్లడించారు. భారత్ లో అనుమతి పొందిన కొవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగం కింద జనవరి 16 నుంచి పంపిణీ జరుగుతోంది. దీంతో పాటు ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీని ఇక్కడి సీరం ఇన్ స్టిట్యూట్ సరఫరా చేస్తోంది.

ఇండియాలో తయారు చేసిన వ్యాక్సిన్ కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఔషధసాయంలో భాగంగా వ్యాక్సిన్‌ మైత్రీ పేరుతో ఈ టీకాలను భారత్‌ పొరుగు దేశాలకు అందిస్తోంది. రెండు మిలియన్ మోతాదులను తీసుకోవడానికి బ్రిటన్ అంగీకరించింది. కరోనా మహమ్మారిపై పోరాడటానికి భారతదేశం తయారు చేసిన టీకా..మానవాళికి ఉపయోగపడుతుందని, పలు దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనలకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు.

బ్రెజిల్, మొరాకాతో ప్రారంభమౌతోందని, తర్వాత..దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియాలకు టీకాలను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ పని తీరులో భారత్ బయోటెక్ తయారు చేసిన టీకా తమ అంచనాలను మించి ఉందని బ్రెజిల్ ఫార్మా సంస్థ డైరెక్టర్ ఎమాన్యుయేల్ మోడ్రాడెన్ ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా..భారత్ బయోటెక్ తో చేసుకున్న ఈ ఒప్పందం ఎంతగానో దోహద పడుతుందన్నారు.