అమెరికాతో కుదిరిన మరో రక్షణ ఒప్పందం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తీరప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికాతో భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కనీసం దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం పూర్తైంది.. ఇంతకీ ఏంటీ బేసిక్ ఎక్స్‌ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటే… అంతరిక్షంలో.. సముద్రతీరంలో ఎక్కడైనా సరే వివిధ కదలికలను సంబంధించిన కీలక సమాచారాన్ని అమెరికా మనకి అందిస్తుంది.ఇందుకోసం మన దేశంలోని కీలక ప్రాంతాలపై ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షణ జరుపుతుంది.. అమెరికా పంపించే డేటాని బట్టి ఎక్కడేం జరుగుతుందన్న విషయం ఖచ్చితమైన సమాచారం మనకి లభిస్తుంది. ఇందుకోసం అమెరికాకి సంబంధించిన నేషనల్ జియోస్పేషియల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ స్వయంగా తనకి ఉన్న జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ నుంచి సహాయ సహకారాలు అందిస్తుంది.మన శాటిలైట్ వ్యవస్థ సరిపోదా..?
సరిహద్దుల వద్ద.. తీరప్రాంతంలో శత్రుమూకల కదలికలను కనిపెట్టడానికి ఇప్పటికే మనకి ఉన్న శాటిలైట్ వ్యవస్థ సమర్ధవంతంగానే పని చేస్తుంది. ఐతే అమెరికాతో తాజా ఒప్పందంతో వచ్చే ప్రయోజనం ఏంటన్న ప్రశ్న రాక మానదు. దానికి అమెరికా హైటెక్ పరిజ్ఞానం మన నిఘా వ్యవస్థకి ఇంకాస్త అద్భుతంగా అక్కరకు వస్తుందన్నదే సమాధానం.అంతేకాదు.. బేసిక్ ఎక్సేంజ్ అగ్రిమెంట్‌తో ఇండియన్ మిలటరీకి డైరక్ట్‌గా అమెరికాకి చెందిన టోపోగ్రాఫికల్, నాటికల్, ఏరోనాటికల్ డేటాని పొందడం వీలవుతుంది. అంటే మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థకి అదనంగా అమెరికా వ్యవస్థని కూడా ఉపయోగించడం వీలవుతుంది.

సరిహద్దుల దగ్గరే కాదు..సముద్రంపైనా..తీర ప్రాంతంలో అనుమానాస్పద కదలికలపై అమెరికా సైనిక ఉపగ్రహాలు పంపే డేటా అత్యంత మైక్రో లెవల్‌ నుంచైనా పంపుతాయ్. దీంతో సూక్ష్మస్థాయి, కచ్చితమైన స్థల-సంబంధ డేటా, వాటికి సంబంధించిన రేఖా చిత్రాలను, వీడియోలను, ఇతర మ్యాప్‌లను భారత్‌ నేరుగా పొందడం కుదురుతుంది.

అసలు టార్గెట్ డ్రాగన్ కంట్రీనే..!
అమెరికా భారత్ మధ్య కుదిరిన ఒప్పందంపై హైదరాబాద్‌ హౌస్‌లో సంతకాలు చేసిన రాజ్ నాథ్ సింగ్, మార్క్ ఎస్పేర్, డీల్‌తో ఇండో-అమెరికా బంధం మరింత బలపడిందన్నారు.. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో కేవలం సమాచార మార్పిడి మాత్రమే కాదు.. డ్రాగన్ కంట్రీ జిత్తులకు చెక్ పెట్టడం కూడా మరో లక్ష్యం అన్నది ఓపెన్‌గానే చెప్తున్నారు.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ఈ విషయాన్నే కుండబద్దలు కొట్టి చెప్పారు కూడా.

రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యల మర్మమేంటి..?
ఈ సందేహాలే ఇప్పుడు ఆసక్తి గొలుపుతున్నాయ్. యూపీఏ హయాం నుంచే పెండింగ్‌లో ఉన్న బెకా డీల్ కుదిరిన తర్వాత రాజ్ నాధ్ సింగ్ చేసిన కామెంట్లు నర్మగర్భంగా మారాయ్. ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికాతో మరిన్ని సమస్యలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారాయన.గత మే నెల నుంచి బోర్డర్ దగ్గర చైనా చేస్తోన్న అతిక్రమణలను దృష్టిలో పెట్టుకునే రాజ్‌నాథ్ ఇలా చెప్పారంటున్నారు.. బెకా డీల్‌తో భౌగోళిక- అంతరిక్ష సమాచారాన్ని పరస్పర మార్పిడి చేసుకోవడం సాధ్యపడుతుంది..అలానే కీలక సైనిక సమాచారాన్ని కూడా రియల్ టైమ్‌లో అంటే.. ప్రత్యక్ష పరిస్థితిని భారత్‌కి అందించేందుకు వీలు పడుతుంది.వాస్తవానికి పాకిస్తాన్‌తో 1999లో కార్గిల్ వార్ సంభవించిన సమయంలో పాక్ సైనికులు సరిహద్దులపైకి చేరుకుంటున్న విషయం నిఘా వర్గాలకు ఆలస్యంగా చేరింది..అలానే గల్వాన్ లోయలో భారీగా డ్రాగన్ ఆర్మీ చేరిన సంగతి కూడా జూన్ 16న ఘర్షణ జరిగిన తర్వాత కానీ తెలిసిరాలేదు.. ఇలాంటి కుట్రలన్నీ తాజా ఒప్పందంతో ముందే పసిగట్టడం సాధ్యపడుతుందని తెలుస్తోంది.

Related Tags :

Related Posts :