లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

India vs Australia 1st ODI : హాఫ్ సెంచరీలు చేసిన వార్నర్, ఫించ్

Published

on

India vs Australia : తొలి సమరం జరుగుతోంది. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం 9గంటల 10నిమిషాలకు భారత్, ఆసిస్ జట్ల మధ్య ఫస్ట్ ఫైట్ ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ బ్యాట్ మెన్స్ ధాటిగా ఆడడం ప్రారంభించారు. ఓపెనర్లు తమ బ్యాట్ లు ఝులిపిస్తుండడంతో స్కోరు పరుగులు తీస్తోంది. వార్నర్, ఫించ్ లు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని రన్లను రాబడుతున్నారు. 69 బంతులను ఎదుర్కొన్న వార్నర్ 60 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఫించ్ (84 బంతులు, 61 రన్లు) చేశాడు. 25.2ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ జట్టు ఒక వికెట్ పోకుండా 135 పరుగులు చేసింది.వీరిని విడదీయడానికి భారత టీం ప్రయత్నాలు చేస్తోంది. షమీ, బుమ్రా, నవదీప్ సైనీ, చాహల్, జడేజాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కరోనా కారణంగా ఐపీఎల్‌ టోర్నీ అభిమానులు లేకుండా జరిగింది. అయితే.. భారత్, ఆసిస్ ఫైట్‌కు మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌ను అనుమతిస్తున్నారు. సిడ్నీలో జ‌రిగే తొలి వ‌న్డేకు 50 శాతం మాత్రమే నిండేలా ప్రేక్షకుల‌ను అనుమ‌తించారు.
9 నెల‌ల త‌ర్వాత ఆడ‌నున్న తొలి అంత‌ర్జాతీయ సిరీస్ కావ‌డంతో టీమిండియా ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. గత ప‌ర్యట‌న‌లో టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచి చ‌రిత్ర సృష్టించిన కోహ్లి సేన.. ఈసారి కూడా అలాంటి అద్భుతం చేస్తుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ గాయం కారణంగా వన్డే, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.ఇండియా టీం : శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, నవదీప్ సైనీ, మహ్మద్ షమి, బస్ప్రీత్ బుమ్రా.ఆసీస్ టీం : డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టాయినిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్, ఆడం జంపా.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *