లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

ఆసీస్ జోరు, భారీ స్కోర్ 374/6

Published

on

india vs australia 1st odi : టీమిండియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. బ్యాట్స్ మెన్స్ చెలరేగి ఆడారు. ప్రధానంగా ఫించ్, స్మిత్ లు భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరూ సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు నమోదైంది. కేవలం 66 బంతులను ఎదుర్కొర్న స్మిత్ 105 రన్లు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్స్ లు ఉండడం గమనార్హం. 124 బంతులను ఎదుర్కొన్న ఫించ్ 114 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్స్ లున్నాయి. మొత్తంగా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఇందులో 21 ఎక్స్ ట్రాలు ఉండడం విశేషం.సిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వస్తూ వస్తూనే ఓపెనర్లు విజృంభించి ఆడారు. వార్నర్, ఫించ్ లు ఆచితూచి ఆడుతూ..స్కోర్ బోర్డును పరుగెత్తించారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి భారత బౌలర్లు శ్రమించారు. చివరకు హాఫ్ సెంచరీ సాధించి..మంచి ఊపు మీదున్న వార్నర్ (69) ను షమీ వెనక్కి పంపించాడు. అప్పటికే ఆసీస్ జట్టు స్కోరు 156.


ఇండియన్ బ్యాట్‌మన్‌ను బెస్ట్ వన్డే ప్లేయర్ ఆఫ్ ఆల్ టైం అని పొగిడేస్తున్న ఫించ్


మరోవైపు ఫించ్ జోరు ఆపలేదు. సింగిల్స్ తీస్తూ..పరుగులు రాబట్టారు. ఇతనికి స్మిత్ చక్కటి సహకారం అందించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఫించ్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 264 వద్ద ఉన్నప్పుడు ఫించ్ (114) పెవిలియన్ చేరాడు. శతకం సాధించిన స్మిత్ (105) కూడా కాసేపెటికే వెనుదిరిగాడు. ఐదో స్థానంలో వచ్చిన మాక్స్ వెల్ జోరుగా ఆడాడు. కేవలం 19 బంతులను ఎదుర్కొన్న ఇతను 45 రన్లు సాధించడం విశేషం. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్స్ లున్నాయి.మార్కస్ స్టాయినిస్ (0), మార్నస్ లబుషేన్ (2) అవుట్ అయ్యారు. క్యారీ 17, కమిన్స్ 1 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది ఆసీస్ జట్టు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు, బుమ్రా 1, చాహల్ 1, నవదీప్ సైనీ 1 వికెట్లు తీశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *