Published
2 months agoon
INDvsAUS: హనుమ విహారీ-రవిచంద్రన్ అశ్విన్ ల భాగస్వామ్యం జట్టుకు బలమైంది. మూడున్నర గంటలకు పైగా నిలబడటంతో ఇండియా మూడో టెస్టును డ్రాగా ముగించి సిరీస్ లో 1-1తో రాణిస్తోంది. అంతకంటే ముందు రిషబ్ పంత్(97; 118 బంతుల్లో) ప్రమాదకరంగా మారాడు. విహారీ 118 బంతులు ఆడిన సమయంలో కేవలం 7పరుగులు మాత్రమే సాధించాడు. చతేశ్వర్ పూజారా(77) ఇన్నింగ్స్ కొనసాగతుంటే ఆసీస్‌కు భయం పుట్టింది.
గాయం నుంచి కోలుకోకుండానే ఇన్నింగ్స్ కు రెడీ అయిన పంత్.. ను అవుట్ చేసేందుకు కంగారూలు శతవిధాల ప్రయత్నించాయి. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే సిడ్నీ గ్రౌండ్ వేదికగా ఇండియా ఆడిన గత మ్యాచ్ కూడా డ్రాగానే ముగిసింది. చివరి వరకూ గెలుస్తుందనిపించిన ఇండియాకు ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం ఓ మాదిరి సంతృప్తిని మాత్రమే ఇవ్వగలదు.
సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఐదో రోజు ఆట.. ఓవర్ల పూర్తయ్యేంతవరకూ టీమిండియా ప్లేయర్లు నిలకడగా ఆడుతుండటంతో మ్యాచ్ డ్రాగా ముగించారు. ఇక నాలుగో టెస్టు మ్యాచ్ మాత్రం బ్రిస్బేన్‌లో 15వ తేదీ నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లా వాసి అనుమానాస్పద మృతి, అసలేం జరిగింది
ఆస్ట్రేలియాలో తెలుగు వాసి అనుమానాస్పద మృతి, రెండేళ్ల కిందటే వివాహం
ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు దూరమైన కీలక ప్లేయర్
ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ పొగిడి చిక్కుల్లో పడ్డ మైకెల్ వాన్
హిట్ మ్యాన్ రికార్డు బ్రేక్ చేసిన గఫ్తిల్
అధిక బరువుతో అడవి గొర్రె అపసోపాలు.. 35కిలోల ఉన్ని కత్తిరించారు!