లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

సిడ్నీ టెస్టు : భారత్ 244 ఆలౌట్

Published

on

India vs Australia 3rd Test : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో మూడో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా జట్టు 94 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆరు వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో పంత్‌, పుజారా ఔటయ్యారు. తొలుత హేజిల్‌వుడ్‌ వేసిన 88వ ఓవర్‌లో పుజారా (50; 176 బంతుల్లో 5×4) అర్ధశతకం సాధించగా అదే ఓవర్‌లో రిషభ్‌పంత్‌ (36; 67 బంతుల్లో 4×4) స్లిప్‌లో వార్నర్‌ చేతికి చిక్కాడు.

దీంతో భారత్‌ 195 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. వీరిద్దరూ 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక కమిన్స్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనే పుజారా కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్‌ అదే స్కోర్‌ వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో జడేజా, అశ్విన్‌ ఉన్నారు. 89 ఓవర్లకు టీమ్‌ఇండియా 195/6 తో కొనసాగింది. బ్యాటింగ్ కొనసాగించిన టీమ్ ఇండియాకు కొద్దిసేపట్లోనే దెబ్బ తగిలింది. అశ్విన్ 10 పరుగుల వద్ద రనౌట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ అశ్విన్ కు సహకరించలేకపోయారు. త్వరత్వరగా వెనుదిరిగారు. మొత్తంగా టీమిండియా జట్టు 244 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 338 పరుగులు చేసింది.

భారత్ బ్యాటింగ్ : గిల్ 50, పుజారా 50, పంత్ 36, జడేజా 28, రోహిత్ 26, రహానే 22, విహారి 4, అశ్విన్ 10, సిరాజ్ 6, సైని 3 పరుగులు సాధించారు.