లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

ఇంగ్లాండ్ సిరీస్ కు భారత జట్టు ఇదే, కోహ్లీ ఈజ్ బ్యాక్

Published

on

India vs England : ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 5 నుంచి 4 టెస్టుల సిరీస్‌లో భారత్ తలపడనుండగా.. తొలి 2 టెస్టుల కోసం భారత్ జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. 18 మందితో కూడిన ఈ జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ‌‌కి చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్‌కి ఈ ఇద్దరూ దూరంగా ఉన్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగానే ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టు మ్యాచ్‌లను టీమిండియా ఆడనుంది.

తొలి రెండు టెస్టులకి భారత్ జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించనున్నాడు. అజింక్య రహానె వైస్ కెప్టెన్ గా వ్యవహించనున్నాడు. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్ లను రెండు టెస్టుల కోసం ఎంపిక చేశారు.
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన యువ ఓపెనర్ పృథ్వీ షాపై వేటు పడింది.

రవీంద్ర జడేజా, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ గాయాల కారణంగా తొలి రెండు టెస్టులకి దూరమయ్యారు. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకూ చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. అక్కడే ఫిబ్రవరి 13 నుంచి 17 వరకూ రెండో టెస్టుని కూడా నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. సిరీస్‌ని బయో సెక్యూర్ బబుల్ వాతావరణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించనుంది.