లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

యువకులకు దక్కిన చోటు.. భారత టీ20 జట్టు ఇదే!

Updated On - 8:09 am, Sun, 21 February 21

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‍‌లో చివరి రెండు టెస్ట్‌లకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్ట్‌లకు ఉన్న జట్టునే భారత జట్టు కొనసాగించింది. గాయం నుంచి కోలుకుని ఉమేశ్ యాదవ్ జట్టులోకి రాగా.. టీమ్‌లో యువ పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను విజయ్ హజారే ట్రోఫీ కోసం విడుదల చేసింది భారత జట్టు.

ఇక లేటెస్ట్‌గా ఇంగ్లాండ్‌‌తో ఆడే T20 భారత జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టి20 మ్యాచ్‌లకు భారత జట్టులో యువ ప్రతిభకు చోటు దక్కింది. అహ్మదాబాద్‌లో జరిగే టీ20 సిరీస్‌ కోసం 19మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్టర్లు ప్రకటించగా.. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో కూడా ముంబై తరఫున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ తరఫున ఆడి ఆఖరి ఓవర్లలో ఆకట్టుకున్న రాహుల్‌ తెవాటియాకు జట్టులో చోటు దక్కింది.

ముంబై ఇండియన్స్‌ జట్టు ఆటగాడు.. ఐపీఎల్ స్టార్ ఇషాన్‌ కిషన్‌ కూడా తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. రిషభ్‌ పంత్‌ జట్టులో ఉన్నా, రెండో వికెట్‌ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేసిన కమిటీ.. సంజు శాంసన్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి జట్టులోకి వస్తుండగా.. పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. మార్చి 12వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మొటెరా స్టేడియంలోనే ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.

భారత జట్టు(T20):
విరాట్​ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, ఇషాన్‌ కిషన్, చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, తెవాటియా, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్‌ చహర్, నవదీప్, శార్దుల్‌ ఠాకూర్

చెన్నై వేదికగా ఫస్ట్ టెస్ట్ చిత్తుగా ఓడి.. రెండో టెస్ట్‌లో భారీ విజయం సాధించిన భారత్.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. చివరి రెండు టెస్ట్‌ల్లో గెలిచి సగర్వంగా టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24-28 వరకు మూడో టెస్ట్(డై/నైట్) జరగనుండగా.. ఇదే వేదికపై మార్చి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు చివరి టెస్ట్ జరగనుంది.

భారత జట్టు(టెస్ట్):
విరాట్​ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, రిషభ్ పంత్, వృద్దీమాన్ సాహా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఉమేశ్​ యాదవ్.

Image

Image