ఇవి మేడిన్ ఇండియా టాప్ 10 బైక్‌లు, కార్లు: మీరెన్ని వాడుతున్నారు?

ఇవి మేడిన్ ఇండియా టాప్ 10 బైక్‌లు, కార్లు:  మీరెన్ని వాడుతున్నారు?

India cars & bikes: ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థగా ఎదుగుతోంది ఇండియా. బోలెడ్ మంది మ్యాన్యుఫ్యాక్చరర్స్ వందల రకాలుగా ఆలోచించి డిజైన్ చేసినవే ఇవి. విదేశీ తయారీదారులు మార్కెట్లోకి వచ్చి అద్భుతాలే సృష్టించినప్పటికీ ఇండియన్ వాహనాలు ఏం తీసిపోకుండా రాణిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా.. మేడ్ ఫర్ ఇండియా అనే గర్వించదగ్గ రీతిలో దూసుకెళ్తున్నాయి.

Tata Nano

రతన్ టాటా ప్రొడక్ట్స్ లలో ఒకటి టాటా నానో. అతను కలగన్న ప్రాజెక్టుల్లో ఒకటి ఇది. సేఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ తో పాటు సాధారణ వ్యక్తి కూడా కొనుగోలు చేయగల ధరలో కారు అందివ్వాలనేదే ఆయన లక్ష్యం. ఈ కోణంలోనే టాటా నానో కారును రూ.లక్షకే అందిస్తున్నారు.

Reva-i

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను ఇండియా ప్రమోట్ చేస్తున్న తరుణంలో ఇండియాలోనే తొలి ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది రెవా-ఐ. ఇండియాలో డెవలప్ అయినా.. విదేశీ మార్కెట్ల లోకి ఎగుమతి అయిపోతుంది. రెవా ఐ మీద అవగాహన లేక.. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకఅమ్మకాల్లో అంత సక్సెస్ కాలేకపోయింది. బెంగళూరు అటు వైపు ప్రాంతాల్లో మాత్రం ఈ మోడల్ తరచూ కనిపిస్తుంటాయి.

Mahindra Scorpio

2002లో లాంచ్ అయిన మహీంద్రా స్కార్పియో.. ఇండియన్ ఆటోమొబైల్ సెక్టార్ నే మార్చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా 50వ వార్షికోత్సవం సందర్భంగా దీనిని లాంచ్ చేశారు. వారు సొంతగా డెవలప్ చేసిన తొలి వాహనం ఇది. జపాన్ కు చెందిన ఏవిఎల్, ఆస్ట్రియా కన్సల్టెంట్స్ ను ఇన్‌పుట్స్‌గా తీసుకుని దీనిని రెడీ చేశారు. 23మంది ఇంజనీర్లతో ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది.

DC Avanti

ఇండియాకు తొలి స్పోర్ట్స్ కారు అందించిన మేకర్ కు ఇతర కారణాల వల్ల వార్తల్లోకి ఎక్కారు. స్పోర్ట్స్ కార్ క్యాటగిరీలో లాంచ్ అయిన డీసీ అవంతి.. రోడ్ కండిషన్స్ కు కరెక్ట్ గా సెట్ అవుతుంది. 248 బీహెచ్పీ, 350ఎన్ఎమ్ లకు టర్బో ఛార్జ్‌డ్.. నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది.

Tork T6X

ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్.. ఏడు సంవత్సరాలు శ్రమించి దీనిని డెవలప్ చేశారు. పూనెకు చెందిన కంపెనీ దీనిని సంవత్సరం క్రితం రెడీ చేశారు. బీఎల్డీసీ 6కిలో వాట్ మోటార్ తో.. ఉన్న బైక్ గంటకు 100కిలోమీటర్ల వేగం ప్రయాణించగలదు. గంటలలోనే ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కేస్తుంది కూడా.

Ather S430

ఇండియాలో తొలి ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్. వైర్ లెస్ కమ్యూనికేషన్ తో మార్కెట్లోకి వచ్చింది. డిజిటల్ కలర్ డిస్ ప్లేతో మార్కెట్లో అందుబాటులో ఉన్న కారుకు ఓటీఏ అప్ డేట్స్ మొబైల్ ఫోన్ల వచ్చినట్లుగానే వస్తాయి. గంటకు 75కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ స్కూటర్.. సింగిల్ ఛార్జితో 100కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

Royal Enfield Himalayan

ప్రపంచంలోనే పురాతనమైన మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఇన్ఫీల్డ్. ఈ కంపెనీ హిమాలయన్ ను 2016లో లాంచ్ చేసింది. ఈ బైక్ కొత్త 411సీసీ ఇంజిన్ తో నాలుగు స్ట్రోక్ ఇంజిన్ తో 24.5మ్యాగ్జిమమ్ పవర్ వచ్చే పీక్ టార్క్ 32ఎన్ఎమ్ ఉండేలా డిజైన్ చేశారు. దిక్సూచితో పాటు, టెంపరేచర్, ఎల్ఈడీ పార్కింగ్ ల్యాంప్స్ కూడా దీనికి అమర్చారు.

Bajaj Pulsar

ప్రజెంట్ బ్యాండ్ నేమ్స్ లో ఒకటి పల్సర్. స్పోర్ట్స్ బైక్ మోడల్ లో లాంచ్ చేశారు. హీరో హోండా సీబీజెడ్ ను పోలిన ఈ బైక్.. సీబీజెడ్ అంత పాపులర్ కాకపోయినా.. మార్కెట్లో బాగానే దూసుకెళ్తుంది.

Tata Indica

1998లో రిలీజ్ అయింది టాటా ఇండికా. ప్యాసింజర్ వెహికల్స్ రెడీ చేసేందుకు టాటా మోటార్స్ ముందుగా దీనినే రెడీ చేసింది. హెవీ ట్రక్స్‌లో ఎక్స్‌పర్ట్ అయిన టాటా.. ఆ తర్వాత ఇండికాను సిద్ధం చేశారు. ఇండియన్ మార్కెట్లోనే తొలి డీజిల్ వెహికల్ టాటా ఇండికా.

Bajaj RE60 Qute

దేశవ్యాప్తంగా అప్రూవల్ సాధించుకున్న బజాజ్ ఆర్ఈ60 కమర్షియల్ వెహికల్ రాణించింది. 216సీసీ.. ట్విన్ సిలిండర్ ఇంజిన్ తో 20బీహెచ్ పీతో నడుస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో సేల్ అవుతున్న ప్రొడక్ట్.. ఇండియన్ అధికారుల అనుమతి పొంది ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.