12-Year-Old Dies: భగత్ సింగ్ వేషధారణతో డ్రామా కోసం ‘ఉరితీత’కు రిహార్సల్స్ చేస్తూ బాలుడి మృతి

పాఠశాలలో భగత్ సింగ్ వేషధారణతో డ్రామా వేసి అలరించాలని ఓ బాలుడు భావించాడు. అందుకోసం రిహార్సల్స్ చేస్తున్నాడు. భగత్ సింగ్ ను బ్రిటిష్ వారు ఉరితీసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఉరి తీసే సీన్ కోసం సాధన చేస్తుండగా ఒక్కసారిగా అది బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతంలో చోటుచేసుకుంది.

12-Year-Old Dies: భగత్ సింగ్ వేషధారణతో డ్రామా కోసం ‘ఉరితీత’కు రిహార్సల్స్ చేస్తూ బాలుడి మృతి

12-Year-Old Dies: పాఠశాలలో భగత్ సింగ్ వేషధారణతో డ్రామా వేసి అలరించాలని ఓ బాలుడు భావించాడు. అందుకోసం రిహార్సల్స్ చేస్తున్నాడు. భగత్ సింగ్ ను బ్రిటిష్ వారు ఉరితీసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఉరి తీసే సీన్ కోసం సాధన చేస్తుండగా ఒక్కసారిగా అది బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ గౌడ అనే 12 ఏళ్ల బాలుడు స్థానికంగా ఉండే ఎస్ఎల్వీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో త్వరలో జరిగే ఓ కార్యక్రమంలో భగత్ సింగ్ వేషధారణతో డ్రామా వేయాలనుకున్నాడు. ఇందుకోసం సాధన చేస్తున్నాడు. ఉరితీత సీన్ కోసం ఇంట్లో పెద్దవారు లేని సమయంలో రిహార్సల్స్ చేశాడు.

ఆ సమయంలో తాడు గొంతుకు బిగుసుకు పోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి తిరిగి వచ్చి చూసిన పెద్దవారిని తమ కుమారుడు విగతజీవిగా కనపడ్డాడు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు తదుపరి దర్యప్తు జరుపుతున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..