COVID-19 In India: దేశంలో కొత్తగా 170 కరోనా కేసులు: కేంద్రం

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగానే నమోదవుతోంది. కొత్తగా 170 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 52 తగ్గి 2,371కి చేరిందని వివరించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,80,094) చేరిందని తెలిపింది.

COVID-19 In India: దేశంలో కొత్తగా 170 కరోనా కేసులు: కేంద్రం

CORONA (1)

COVID-19 In India: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగానే నమోదవుతోంది. కొత్తగా 170 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 52 తగ్గి 2,371కి చేరిందని వివరించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,80,094) చేరిందని తెలిపింది.

కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 5,30,721 మంది మృతి చెందినట్లు పేర్కొంది. నిన్న కరోనా వల్ల ఒకరు మృతి చెందారని వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయని తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగిందని చెప్పింది. కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,41,47,002 ఉన్నాయని పేర్కొంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.20 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.11 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు వినియోగించిన కరోనా డోసుల సంఖ్య 220.14 కోట్లుగా ఉందని చెప్పింది. నిన్న దేశ వ్యాప్తంగా 10,336 కరోనా డోసులు వేసినట్లు తెలిపింది. నిన్న దేశ వ్యాప్తంగా 85,282 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

ICICI Loan Case: ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టులో ఊరట..