COVID-19 UPDATE: దేశంలో భారీగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు.. కొత్తగా 1,997 మందికి పాజిటివ్

దేశంలో కొత్తగా 1,997 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,908 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,47,344 ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం దేశంలో 30,362 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతం ఉన్నట్లు చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.94 శాతం ఉన్నట్లు తెలిపింది.

COVID-19 UPDATE: దేశంలో భారీగా తగ్గిన రోజువారీ కరోనా కేసులు.. కొత్తగా 1,997 మందికి పాజిటివ్

Corona

COVID-19 UPDATE: దేశంలో కొత్తగా 1,997 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,908 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,47,344 ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం దేశంలో 30,362 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతం ఉన్నట్లు చెప్పింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.94 శాతం ఉన్నట్లు తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.34 శాతం ఉన్నట్లు పేర్కొంది. నిన్న 3,97,407 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది. దీంతో ఇప్పటివరకు వేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య మొత్తం 218.88 కోట్లకు చేరిందని చెప్పింది. వాటిలో రెండో డోసులు 94.89 కోట్లు, బూస్టర్ డోసులు 21.50 కోట్లు ఉన్నాయని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 89.64 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 2,13,123 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..