India vs New Zealand: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

భారత్-న్యూజిలాండ్ మధ్య ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. తొలి వన్డేలో ఆడిన ఆటగాళ్లందరూ రెండో వన్డేలోనూ ఆడుతున్నారు.

India vs New Zealand: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

India vs New Zealand

India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. తొలి వన్డేలో ఆడిన ఆటగాళ్లందరూ రెండో వన్డేలోనూ ఆడుతున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ న్యూజిలాండ్ చివరి వరకు పోరాడి ఓడింది. నేటి వన్డేలోనూ భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఒక వన్డే గెలిచిన టీమిండియా నేటి వన్డేలోనూ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది.

నేటి రెండో వన్డేలో భారత జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ ఉన్నారు.

న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్, ఫిన్ అలెన్, కాన్వే, హెన్రీ నికోలస్, డ్యారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్ వెల్, శాంట్నర్, హెన్రీ షిప్లే, ఫెర్గుసన్, బ్లైర్ తిక్నర్ ఉన్నారు.

Tirumala: తిరుమలలో డ్రోన్ దృశ్యాలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి.. ఏమన్నారంటే?