4-storey building collapses: ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. వీడియో

మహారాష్ట్ర రాజధాని ముంబైలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని బోరీవాలి ప్రాంతంలో సాయిబాబా మందిర్ పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాట్లాడుతూ.. ‘బోరీవాలి ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయిందని సమాచారం అందింది. ఆ ప్రాంతానికి ఎనిమిది ఫైర్ ఇంజన్లను పంపాము’ అని చెప్పారు.

4-storey building collapses: ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. వీడియో

4-storey building collapses

4-storey building collapses: మహారాష్ట్ర రాజధాని ముంబైలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని బోరీవాలి ప్రాంతంలో సాయిబాబా మందిర్ పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాట్లాడుతూ.. ‘బోరీవాలి ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయిందని సమాచారం అందింది. ఆ ప్రాంతానికి ఎనిమిది ఫైర్ ఇంజన్లను పంపాము’ అని చెప్పారు.

కాగా, భవనం కూలిన ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భవనం కూలుతుండగా తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆ భవనం పాతబడిపోయిన కారణంగా కూలిపోయినట్లు తెలుస్తోంది. భవనం కింద ఎంతమంది చిక్కుకున్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది.