ఫ్లూ కారణంగా ఫౌల్ట్రీలో 65కోళ్లు మృత్యువాత.. భయాందోళనలో నగరవాసులు

ఫ్లూ కారణంగా ఫౌల్ట్రీలో 65కోళ్లు మృత్యువాత.. భయాందోళనలో నగరవాసులు

flu-spread-to-states-in-india-poultry-farm

Poultry Birds: జలగావ్ జిల్లాలోని ఓ ఫౌల్ట్రీ ఫాంలో 65కోళ్లు మృత్యువాతకు గురయ్యాయి. ఫిబ్రవరి 15న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 7లక్షల 12వేల 712ఫౌల్ట్రీ పక్షులు పాడైపోయాయని అధికారులు అంటున్నారు. నవపూర్ సిటీ సమీపంలోని నందూర్‌బర్ ప్రాంతంలో 26లక్షల 3వేల 728గుడ్లు, 72వేల 974కేజీల మాంసం ఇన్ఫెక్టెడ్ జోన్ కింద ఉండటంతో మొత్తం తగులబెట్టేశారు.

మత్స్య, జంతు సంరక్షణ, పాల ఉత్పత్తుల మంత్రిత్వ శాక ప్రకారం.. జనవరి 30వరకూ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా మొత్తం 10రాష్ట్రాల్లో/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైనట్లు కన్ఫామ్ అయింది. కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఉత్తరాఖాండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జమ్మూ అండ్ కశ్మీర్ లలో ఫ్లూ కన్ఫామ్ అయింది.

అంతేకాకుండా.. 13 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలైన మధ్య ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, చత్తీస్ ఘర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, ఢిల్లీ, రాజస్థాన్, జమ్మూ అండ్ కశ్మీర్, పంజాబ్, బీహార్ లలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి చెందడంతో కాకులు, ఇతర పక్షులు కూడా ప్రాణాలు కోల్పోయాయి.