ట్రాక్టర్ పరేడ్‌లో రైతుల్లాగే మేమూ పాల్గొంటాం: ఆమ్ ఆద్మీ

ట్రాక్టర్ పరేడ్‌లో రైతుల్లాగే మేమూ పాల్గొంటాం: ఆమ్ ఆద్మీ

Tractor Parade: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ యూనిట్ జనవరి 26న ఢిల్లీలో జరిగే ట్రాక్టర్ పరేడ్ లో పాల్గొంటామని ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ భగవత్ మన్న ఈ మేరకు ప్రకటన చేస్తూ.. ప్రపంచంలోనే అతి పెద్ద నిరసనగా నిలవనుందని అన్నారు. పెద్ద ఎత్తులో పాల్గొని ప్రశాంత ధోరణిలో నిరసన వ్యక్తం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ వాలంటీర్లు ప్రతి గ్రామం నుంచి కదలి వచ్చి ట్రాక్టర్ పరేడ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆందోళనలో ఓ రాజకీయ పార్టీలా కాకుండా రైతులా పాల్గొననుంది. అని సంగ్రూర్ ఎంపీ స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది. ఆప్ సామాన్యుల పార్టీ అని ఇందులో దాదాపు శ్రామికులు, రైతులే ఉంటారని అన్నారు.

ఈ పోటీ కేవలం కొత్త రైతు చట్టాలకు నిరసనగా మాత్రమే కాదు.. రాజ్యాంగాన్ని కాపాడటం కోసం కూడా. ప్రశాంత ధోరణిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడమనేది రాజ్యాంగపరమైన హక్కు. ప్రభుత్వం దీనిని లాగేసుకోవాలనుకుంటుంది. రైతు ఆందోళనకు అణగదొక్కడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నడుస్తోన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగపరమైన హక్కులను లాగేసుకోవాలని చూస్తుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది దేశానికి చాలా ప్రమాదకరం అని విమర్శలు గుప్పించారు.