Active Covid cases: దేశంలో 27,374కి తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసులు కాస్త తగ్గి 27,374గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,46,16,394కి చేరిందని వివరించింది. నిన్న కరోనా వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. మృతుల సంఖ్య మొత్తం కలిపి 5,28,822గా ఉందని వివరించింది.

Active Covid cases: దేశంలో 27,374కి తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు

india corona cases

Active Covid cases: దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసులు కాస్త తగ్గి 27,374గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,46,16,394కి చేరిందని వివరించింది. నిన్న కరోనా వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. మృతుల సంఖ్య మొత్తం కలిపి 5,28,822గా ఉందని వివరించింది.

మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉన్నాయని చెప్పింది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేట్ 0.71 శాతం, వారాంతపు పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉన్నట్లు చెప్పింది. నిన్న కరోనా నుంచి 2,654 మంది కోలుకున్నట్లు చెప్పింది.

కరోనా నుంచి దేశంలో కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,40,60,198కి చేరిందని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 219.04 కరోనా డోసులు వినియోగించినట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 89.74 కోట్లకు చేరిందని వివరించింది. నిన్న 2,76,125 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..