వరుసగా.. ఐదు నెలలుగా జియోను దెబ్బకొడుతున్న ఎయిర్‌టెల్

వరుసగా.. ఐదు నెలలుగా జియోను దెబ్బకొడుతున్న ఎయిర్‌టెల్

Reliance-Jio-Airtel-VI

Airtel – Jio: మొబైల్ నెట్‌వర్క్ లీడర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ను దాటేసింది ఎయిర్ టెల్. వరుసగా ఐదో నెల అంటే డిసెంబర్ 2020లోనూ యూజర్లను భారీగా పెంచుకుంది. మరో వైపు వొడాఫోన్ ఐడియా అదే రీతిలో కొనసాగుతూ.. అధికారులను నిరాశపరుస్తుంది.

జియోకు 0.47మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉంటే.. ఎయిర్‌టెల్ 4.05మిలియన్ వైర్ లెస్ యూజర్లను దక్కించుకుంది. వొడాఫోన్ మళ్లీ సతమతమవుతూ 5.7మిలియన్ యూజర్లను కోల్పోయింది. గురువారం ట్రాయ్ రిలీజ్ చేసిన టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం వివరాలిలా ఉణ్నాయి.

విజిటర్ లొకేషన్ రిజిష్టర్ ఆధారంగా సబ్ స్క్రైబర్స్ ను లెక్కడగడతారు. అలాచూస్తే.. భారతీ ఎయిర్ టెల్ కు 97.1శాతం యూజర్లు రాగా, వొడాఫోన్ ఐడియాకు 90.26శాతం, జియోకు 80.23శాతం మంది మాత్రమే వచ్చారు. క్వార్టర్లీ ఎర్నింగ్స్ ప్రకారం.. చూస్తే ఈ మూడు నెలల్లో డిఫరెంట్ గా యూజర్లను పట్టుకొచ్చారు.

యాక్టివ్ అండ్ ఇన్ యాక్టివ్ సబ్‌స్క్రైబర్స్ అనే రెండు రకాలుగా పరిగణిస్తారు. అదే ఎయిర్ టెల్ కంటే జియోకు కొద్ది నెలలుగా యూజర్లు పెరిగారు.