Bihar Political Crisis 2022: నాకు మంత్రి పదవి ఇవ్వండి.. బిహార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఒకే ఒక్క ‘యాదవ్’ను నేను: ఛత్రపతి యాదవ్

బిహార్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఛత్రపతి యాదవ్ తమ పార్టీ అధిష్ఠానానికి ఓ లేఖ రాశారు. తన కులాన్ని చూసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాశాను. బిహార్ మంత్రివర్గంలో నాకు అవకాశం ఇవ్వాలని నేను కోరాను. నన్ను కేబినెట్ లోకి తీసుకుంటే ఓబీసీలకు, ముఖ్యంగా యాదవ్ లకు మంచి సందేశం వెళ్తుందని చెప్పాను. బిహార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఒకే ఒక్క యాదవ్ ను నేను’ అని ఆయన చెప్పారు.

Bihar Political Crisis 2022: నాకు మంత్రి పదవి ఇవ్వండి.. బిహార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఒకే ఒక్క ‘యాదవ్’ను నేను: ఛత్రపతి యాదవ్

Bihar Political Crisis 2022: బిహార్‌లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మంత్రి పదవులు పొందడానికి ఆశావాహులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నెల 24న అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్ బలపరీక్షకు దిగుతున్నారు. అలాగే, మంత్రివర్గ విస్తరణ ఆగస్టు 16న జరగనుంది. కాంగ్రెస్ పార్టీలో ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. దీంతో బిహార్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఛత్రపతి యాదవ్ తమ పార్టీ అధిష్ఠానానికి ఓ లేఖ రాశారు. తన కులాన్ని చూసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.

ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాశాను. బిహార్ మంత్రివర్గంలో నాకు అవకాశం ఇవ్వాలని నేను కోరాను. నన్ను కేబినెట్ లోకి తీసుకుంటే ఓబీసీలకు, ముఖ్యంగా యాదవ్ లకు మంచి సందేశం వెళ్తుందని చెప్పాను. బిహార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఒకే ఒక్క యాదవ్ ను నేను’ అని ఆయన చెప్పారు.

తన తండ్రి, దివంతగ నేత రాజేంద్ర ప్రసాద్ యాదవ్ గతంలో సీఎంలు బిందేశ్వరీ దుబే, భగవత్ ఝా ఆజాద్, జగన్నాథ్ మిశ్రాల కేబినెట్లలో పనిచేశారని ఛత్రపతి యాదవ్ అన్నారు. కాగా, వామపక్ష పార్టీలు కూడా మహాఘట్‌బంధన్ కు మద్దతు ప్రకటించాయి. నితీశ్ కేబినెట్ లో జేడీయూ కంటే ఆర్జేడీకి చెందిన నేతలే అధికంగా ఉండనున్నారు. మహాఘట్‌బంధన్ లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ తో పాటు పలు ఇతర పార్టీలు స్వతంత్ర్య ఎమ్మెల్యేలూ ఉన్నారు.

Shirdi Saibaba Temple: షిర్డీ సాయిబాబాకు రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని విరాళంగా అందించిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్