Viral video: టీఎంసీ నేతకు చెప్పులు చూపెడుతూ ‘దొంగా.. దొంగా’ అని అరిచిన స్థానికులు

ఓ టీఎంసీ నేతకు ప్రజలు చెప్పులు చూపించారు.. దొంగా దొంగా అంటూ అరుస్తూ ఆయనకు చుక్కలు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్‌ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత్ మండల్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆయనను ఇవాళ ఆసన్‌సోల్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అధికారులు తీసుకు వెళ్ళారు. ఈ సందర్భంగానే అనుబ్రత్ మండల్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది.

Viral video: టీఎంసీ నేతకు చెప్పులు చూపెడుతూ ‘దొంగా.. దొంగా’ అని అరిచిన స్థానికులు

Viral video

Viral video: ఓ టీఎంసీ నేతకు ప్రజలు చెప్పులు చూపించారు.. దొంగా దొంగా అంటూ అరుస్తూ ఆయనకు చుక్కలు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్‌ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత్ మండల్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఆయనను ఇవాళ ఆసన్‌సోల్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అధికారులు తీసుకు వెళ్ళారు. ఈ సందర్భంగానే అనుబ్రత్ మండల్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది.

కాగా, జంతువుల స్మగ్లింగ్ కేసులో సీబీఐ అధికారులు అనుబ్రత్ మండల్ ను విచారిస్తున్నారు. ఆయనకు సమన్లు పంపినప్పటికీ కేసులో విచారణకు రాకపోవడంతో ఇవాళ ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళారు. ఆ సమయంలో కేంద్రీయ రిజర్వు పోలీసు దళాలను కూడా తీసుకె వెళ్ళడం గమనార్హం. స్థానికంగా ఆయనకు అనుచరులు అధికంగా ఉండడంతో సీబీఐ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

అనుబ్రత్ మండల్ ను ఎట్టకేలకు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని కొన్ని రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు టీఎంసీ నేతలు పలు కేసుల్లో కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణకు హాజరవుతున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రతిష్ఠ మసకబారుతోంది.