​Apple’s new iPhone 14: భారత్‌లో ఐఫోన్‌-14 మోడల్స్‌ ఉత్పత్తి.. యాపిల్‌ సంస్థ ప్రయత్నాలు

భారత్‌లో ఐఫోన్‌-14 మోడల్స్‌ను తయారు చేయాలని యాపిల్‌ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఆసియాలో కొత్తగా ఐఫోన్ విడుదలైతే ఇప్పటివరకు మొదట చైనా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాతే భారతీయులకు అందుబాటులోకి వస్తోంది. చైనాలో విడుదలైన 2-3 నెలల తర్వాత భారత్ లో విడుదల అవుతోంది. భారత్ లోనూ ఐఫోన్‌-14 మోడల్స్‌ తయారైతే ఇకపై ఈ సమస్య ఉండదు. యాపిల్ నుంచి వచ్చే తదుపరి ఐఫోన్ భారత్, చైనాల్లో దాదాపు ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

​Apple’s new iPhone 14: భారత్‌లో ఐఫోన్‌-14 మోడల్స్‌ ఉత్పత్తి.. యాపిల్‌ సంస్థ ప్రయత్నాలు

​Apple’s new iPhone 14

​Apple’s new iPhone 14: భారత్‌లో ఐఫోన్‌-14 మోడల్స్‌ను తయారు చేయాలని యాపిల్‌ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఆసియాలో కొత్తగా ఐఫోన్ విడుదలైతే ఇప్పటివరకు మొదట చైనా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాతే భారతీయులకు అందుబాటులోకి వస్తోంది. చైనాలో విడుదలైన 2-3 నెలల తర్వాత భారత్ లో విడుదల అవుతోంది. భారత్ లోనూ ఐఫోన్‌-14 మోడల్స్‌ తయారైతే ఇకపై ఈ సమస్య ఉండదు. యాపిల్ నుంచి వచ్చే తదుపరి ఐఫోన్ భారత్, చైనాల్లో దాదాపు ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విదేశాల నుంచి భారత్ కు ఐఫోన్ దిగుమతి అయి విడుదలయ్యేందుకు దాదాపు 6 నెలల నుంచి 9 నెలల వరకు పడుతోంది. ప్రస్తుతం చైనా-అమెరికా మధ్య సత్సంబంధాలు క్షీణిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాపిల్‌ భారత్‌లో ఐఫోన్‌-14 మోడల్స్‌ను తయారు చేయాలని భావిస్తుండడం గమనార్హం. అలాగే, చైనా-భారత్ దేశాల్లో తమ మోడల్స్ వేర్వేరు సమయాల్లో విడుదల అవుతుండడం పట్ల కూడా యాపిల్ దృష్టిసారించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక, చైనాలో జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తూ కఠిన లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చైనాలో ఐఫోన్ల ఉత్పత్తుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో యాపిల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ భారత్ లో ఐఫోన్ ఉత్పత్తుల సాధ్యాసాధ్యాలను యాపిల్ సంస్థ పరిశీలిస్తున్నట్లు సమాచారం. చైనా నుంచి భారత్ లోని చెన్నై కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఏదైనా ఒక తమ తయారీ కేంద్రానికి తరలించాలని యోచిస్తోంది. అక్టోబరు లేదా నవంబరు నుంచే భారత్‌లో ఐఫోన్‌-14 మోడల్స్‌ ను యాపిల్ సంస్థ విడుదల చేసే అవకాశం ఉంది. మేడిన్ ఇండియా ఐఫోన్‌-14 వచ్చే దీపావళికి నాటికి భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..