Doctor Runs 3 Km: ట్రాఫిక్‌లోనే కారు వదిలేసి 3 కి.మీ.పరిగెత్తి.. రోగికి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్

కారులో వెళ్తే ఆపరేషన్ సమయానికి ఆసుపత్రికి చేరుకోలేనని గ్రహించిన వైద్యుడు రోగి ప్రాణాలను కాపాడేందుకు ఆ కారును ట్రాఫిక్ లోనే విడిచేసి, కారు దిగి పరుగులు తీశాడు. మూడు కిలోమీటర్లు పరిగెత్తుకు వెళ్లాడు. చివరకు సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకుని ఆపరేషన్ చేసి రోగి ప్రాణాలు కాపాడాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు దిగి ఆపరేషన్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ వైద్యుడి పేరు డా.గోవింద్ నందకుమార్.

Doctor Runs 3 Km: ట్రాఫిక్‌లోనే కారు వదిలేసి 3 కి.మీ.పరిగెత్తి.. రోగికి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్

Doctor Runs 3 Km

Doctor Runs 3 Km: ఆసుపత్రిలో ఓ రోగికి ఆపరేషన్ చేసి, అతడిని బతికించాల్సి ఉంది. సరిగ్గా ఆపరేషన్ చేసే సమయానికి ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో వైద్యుడు లేకపోతే ఆ రోగి ప్రాణాలకే ప్రమాదం. దీంతో అనుకున్నదానికంటే కాస్త ముందే ఇంటి నుంచి ఆసుపత్రికి బయలుదేరాడు ఆ వైద్యుడు. అయితే, దారిలో భారీ ట్రాఫిక్. రోడ్డుపై ఉన్న వాహనాలు అన్నీ నత్తనడకన ముందుకు కదులుతున్నాయి. ఆ ట్రాఫిక్ లో చిక్కుకుపోయాడు వైద్యుడు. ఆసుపత్రి ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.

కారులో వెళ్తే ఆపరేషన్ సమయానికి ఆసుపత్రికి చేరుకోలేనని గ్రహించిన వైద్యుడు రోగి ప్రాణాలను కాపాడేందుకు ఆ కారును ట్రాఫిక్ లోనే విడిచేసి, కారు దిగి పరుగులు తీశాడు. మూడు కిలోమీటర్లు పరిగెత్తుకు వెళ్లాడు. చివరకు సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకుని ఆపరేషన్ చేసి రోగి ప్రాణాలు కాపాడాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు దిగి ఆపరేషన్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ వైద్యుడి పేరు డా.గోవింద్ నందకుమార్.

సర్జార్ పూర్ లోని మణిపాల్ ఆసుపత్రిలో గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జన్ గా పనిచేస్తున్నారు. ఓ రోగికి లాపరోస్కోపిక్ పిత్తాశయ శస్త్రచికిత్స చేయాల్సి ఉండడంతో ఆయన మూడు కిలోమీటర్లు పరిగెత్తాడు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ఇప్పుడు ఆ రోగిని డిశ్చార్జ్ చేశామని ఆ ఆసుపత్రి తెలిపింది. రోగి ప్రాణాలు కాపాడడానికి గోవింద్ నందకుమార్ చేసిన సాహసంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు.. 47,176 యాక్టివ్ కేసులు